
`Rx100` సంచలన విజయంలో కార్తకేయ పేరు ఒక్కసారిగా మారుమ్రేగిపోయింది. ఈ మూవీతో హీరోగా మరింత పాపుల్ కావడమే కాకుండా మంచి గుర్తింపుని కూడా సొంతం చేసుకున్నాడు కార్తీకేయ. ఆయితే ఆ తరువాత వరుసగా క్రేజీ ఆఫర్లని సొంతం చేసుయకున్నా ఆ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు.
ఆ స్థాయి విజయం మరోసారి అందుకోవాలని గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు కానీ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఎంచుకున్న కథల్లో బలం లేకపోవడం.. లేదా కథలు మంచివే అయినా వాటిని తీర్చి దిద్దే దర్శకుల్లో లోపం వుండటం వల్ల కార్తీకేయ చేసిన ప్రతీ ప్రయత్నం విఫలం అవుతూనే వస్తోంది.
తాజాగా కార్తికేయ చేసిన మరో ప్రయోగం `చావు కబురు చల్లగా`. బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఆశించి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో హీరో కార్తికేయ పెట్టిన పోస్ట్ తాజాగా వైరల్ గా మారింది. బస్తీ బాలరాజు పాత్ర చేసినందుకు తాను గర్వంగా వున్నానని చెప్పిన కార్తికేయ ఇదే సందర్భంగా ఈ సినిమా నచ్చిన ప్రేక్షకులు తనని క్షమించాలని, తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరడం ఆసక్తికరంగా మారింది.