Homeరివ్యూస్అజ్ఞాతవాసి రివ్యూ

అజ్ఞాతవాసి రివ్యూ

జానర్ : ఫ్యామిలీ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్

నటీనటులు : పవన్ కళ్యాణ్, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్, ఖుష్బూ ,ఆది పినిశెట్టి, త‌నికెళ్ల భ‌ర‌ణి , బొమన్ ఇరానీ, మురళీ శర్మ, రావు రమేష్,

- Advertisement -

సంగీతం :  అనిరుధ్ రవిచందర్

నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు )

దర్సకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

రేటింగ్ : 3.25/ 5

                                            రిలీజ్ డేట్ : 10 జనవరి 2018

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన జల్సా , అత్తారింటికి దారేది చిత్రాలు సంచలన విజయాలు సాధించడంతో ముచ్చటగా మూడో చిత్రంగా వస్తున్న అజ్ఞాతవాసి చిత్రంపై అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అజ్ఞాతవాసి చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

 కథ :

ఏబీ గ్రూప్  మ‌ల్టినేష‌న్ కంపెనీ స్థాపిస్తాడు గోవింద భార్గవ్ (బొమన్ ఇరానీ).ఈ కంపెనీలో త‌న స్నేహితుల‌నే పార్ట‌న‌ర్స్ గా  చేర్చ‌కుంటాడు..అయితే ఆ కంపెనీకి సిఇఓ అవ్వాల‌నేదే  సీతారామ్‌ (ఆది పినిశెట్టి)  ల‌క్ష్యం..దానికోసం బోమ‌న్ ఇరానీ కుటుంబ‌స‌భ్యుల‌ను చంపూకుంటూ వ‌స్తాడు ఆది..ఆయ‌న కుటుంబానికి వార‌సులు లేక‌పోతే ఆతిప‌త్యం చేక్కించుకోవ‌చ్చ‌ని ఆది భావిస్తాడు.  దీంతో గోవింద భార్గవ్ భార్య ఇంద్రాణీ (ఖుష్బూ) కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు అస్సాం నుంచి బాలసుబ్రహ్మణ్యం

(పవన్ కళ్యాణ్ ) అనే వ్యక్తిని తీసుకువస్తుంది. ఏబీ గ్రూప్ లో  మేనేజర్ గా జాయిన్ అయిన బాలసుబ్రహ్మణ్యం… గోవింద భార్గవ్ వారసుడి హత్యకు కారణ‌మైన ఆదిని ఏం చేశాడు…  ఈ ప్రయత్నంలో బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించాడా..? సీతారామ్‌ (ఆది పినిశెట్టి) సిఇఓ అయ్యాడా ..? హత్యకు కారణాలు తెలుసుకోవడానికి ఇంద్రాణీ బాలసుబ్రహ్మణ్యాన్నే ఎందుకు ఎంచుకుంది..? బాలసుబ్రహ్మణ్యం.. అభిషిక్త భార్గవ్‌ ఎలా అయ్యాడు..? అన్నదే మిగతా కథ.

 

నటీనటుల ప్రతిభ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌ట‌న ప‌రంగా అద‌ర‌గొట్టాడని చెప్పోచ్చు.  తన మేనరిజమ్స్, స్టైల్స్‌ తో సినిమా ఆద్యంతం అల‌రించాడు. అత్తారింటికి దారేది చిత్రం త‌ర్వాత   పవన్ లుక్స్, ఎమోషనల్ సీన్స్ లోనూ పవన్ తన పరిణితి చూపించాడు. ఇక తనదైన మేనారిజ‌మ్ తో కామెడీ పండించ‌డంలో ప‌వ‌న్ మ‌రోసారి స‌క్సెస్ సాధించాడు. కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్,  పాత్రలకు ప్రాధాన్యం లేకపోయినా పాత్ర‌ప‌రిదిలో అందం,అభిన‌యంతో పాటు రోమాంటిక్ స‌న్నివేశాల‌లో ర‌క్తిక‌ట్టించారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సీనియర్ నటి ఖుష్బూ తన స్థాయికి తగ్గ పాత్రలో కనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో ఖుష్బూ  నటనన సినిమాకు ప్లస్ అయ్యింది. స్టైలిష్ విలన్ గా స‌రైనోడు చిత్రం త‌ర్వాత ఆది పినిశెట్టి మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. . బొమన్ ఇరానీ, రావూ రమేష్, మురళీ శర్మలు ,త‌నికెళ్ల భ‌ర‌ణి , ర‌ఘ‌బాబు పాత్రలకు తమవంతు న్యాయం చేశారు.

 

అజ‍్ఞాతవాసి చిత్రం .. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్‌ ఇన్సిపిరేషన్ తో తెరకెక్కించారనే అనిపిస్తోంది . ఫ్రెంచ్ చిత్రం క‌థ ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌రగా ఉంటుంది.. అయితే ఈ కథను మన నేటివిటికీ తగ్గట్టు ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి కామెడీ జోడించి వినోదాత్మకంగా తెరకెక్కించాడు త్రివిక్రమ్‌. పవన్ ఇమేజ్‌కు, ఫాలోయింగ్ కు  తగ్గ ఫర్పెక్ట్ కథతో ఆడియన్స్ ను ఖుషీ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన మార్క్ పంచ్ డైలాగ్స్ను తో  మ‌రోసారి  అలరించాడు.ప‌వ‌న్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ కి ఏం కావాలి అది ఈ చిత్రం ద్వారా అందించ‌డంలో త్రివిక్ర‌మ్ స‌క్సెస్ సాధించాడు..విల‌న్ పాత్ర హీరో పాత్ర‌కు త‌గ్గ‌ట్టులేక‌పోవ‌డం కాస్త నిరాశ‌ను క‌లిగిస్తోంది…ఫ‌స్ట్ హాఫ్ లో స్ర్కీన్ ప్లే  స్లోగా ఉన్నా ప‌వ‌న్ త‌న‌దైన న‌ట‌న‌తో కామెడీ పండించడంతో ప‌ర్వాలేద‌నిపిస్తోంది.  ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు స్లోగా కథ నడిపించిన త్రివిక్రమ్‌ తరువాత ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో ఆడియన్స్ ను కథలో లీనం చేశాడు. గత చిత్రాలతో పోలిస్తే త్రివిక్రమ్ మాట‌ల‌కు  పదును తగ్గినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో త్రివిక్రమ్ గత చిత్రాలలో స‌న్నివేశాల పోలిక‌లు క‌నిపిస్తాయి…

సినిమాకు మరో పస్ల్‌ పాయింట్ మణికందన్ సినిమాటోగ్రఫి. ఫారిన్ లోకేషన్స్ తో పాటు పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సన్నివేశాలను కూడా చాలా అందంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు మ్యూజిక్ కొంత‌వ‌ర‌కు మైన‌స్ గా చెప్పోచ్చు అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ త‌ప్పా…సాంగ్స్ మాత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్ ని నిరాశ‌ప‌రిచాయ‌ని చెప్పోచ్చు..ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన పాట కోడ‌కా కోటేశ్వ‌ర‌రావు సాంగ్ బాగుంది.. ఎడిటర్ కొటగిరి వెంకటేశ్వరరావు  కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకెండ్ హాప్ లో కొంత ట్రిమ్ చేస్తే బాగుంటుంది.. హారికా హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా గ్రాండ్ గా  సినిమాను రూపొందించారు.

ప్లస్ పాయింట్స్ :

పవన్ నటన

ఇంటర్వెల్ బ్యాంగ్

మురళీ శర్మ, రావూ రమేష్ కామెడీ

సినిమాటోగ్ర‌ఫి

మైనస్ పాయింట్స్ :

 

బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌

 

 

ఓవరాల్ గా :

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో రూపోందిన అజ్ఞాత‌వాసి చిత్రం ఫ్యాన్స్ ను ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది..పక్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఎంజాయ్ చేయాల‌నుకునే వారికి ఈ చిత్రం ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All