Homeగాసిప్స్ప్రభాస్ కూడా ఎన్టీఆర్ కోసం వస్తున్నాడా?

ప్రభాస్ కూడా ఎన్టీఆర్ కోసం వస్తున్నాడా?

ప్రభాస్ కూడా ఎన్టీఆర్ కోసం వస్తున్నాడా?
ప్రభాస్ కూడా ఎన్టీఆర్ కోసం వస్తున్నాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన హోస్టింగ్ స్కిల్స్ ను మరోసారి నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ బిగ్ బాస్ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేస్తున్నాడు. ఈ షో ఒక వారానికి మించి మరొక వారం టీఆర్పీలను పెంచుకుంటూ పోతోంది. ఈ షో సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ పేరు బుల్లితెరపై మరోసారి మార్మోగిపోతోంది.

ఇదిలా ఉంటే ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం రామ్ చరణ్, కొరటాల శివ, ఎస్ ఎస్ రాజమౌళి వంటి వారు విచ్చేసారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షో కు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. లీకైన ఇమేజెస్ ప్రకారం అది నిజమని తేలింది. దసరాకు ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేస్తారని సమాచారం.

- Advertisement -

అయితే ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఎవరు మీలో కోటీశ్వరులు టీమ్ టచ్ లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభాస్ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాడట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All