Homeగాసిప్స్చేయ‌నంటున్నా వెంట‌ప‌డుతున్నారా?

చేయ‌నంటున్నా వెంట‌ప‌డుతున్నారా?

చేయ‌నంటున్నా వెంట‌ప‌డుతున్నారా?
చేయ‌నంటున్నా వెంట‌ప‌డుతున్నారా?

కొన్ని సినిమాలు కొంత మందే చేయాలి. కొంత మంది అలాంటి పాత్ర‌లే చేయాలి.. ఎంద‌కంటే వాళ్ల రేంజ్ అలాంటిది. ఇదే ఫార్ములాతో ధూమ్ సిరీస్ చిత్రాల్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు బాలీవుడ్ దర్శ‌క‌నిర్మాత ఆదిత్య చోప్రా. అలా ఆయ‌న చేసిన ధూమ్ సిరీస్ చిత్రాల్లో మూడు వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి. తొలి `ధూమ్‌`లో జాన్ అబ్ర‌హం, సీక్వెల్‌లో హృతిక్ రోష‌న్‌, `ధూమ్ 3`లో ఆమీర్‌ఖాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

తొలి పార్ట్ నుంచి `ధూమ్ 3` వ‌ర‌కు అన్ని చిత్రాలూ బ్లాక్ బ‌స్ట‌ర్‌లుగా నిలిచాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా నాలుగ‌వ భాగాన్ని తెర‌పైకి తీసుకు‌రావాల‌ని గ‌త కొంత కాలంగా ఆదిత్య చోప్రా ప్లాన్ చేస్తున్నాడు. కానీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. షారుఖ్‌ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్‌ల పేర్లు వినిపించాయి. అయితే కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజాగా ప్ర‌భాస్ పేరు వినిపిస్తోంది.

- Advertisement -

కానీ ప్ర‌భాస్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించ‌డం లేద‌ట‌. కార‌ణంగా భారీ స్థాయిలో వుంటే యాక్ష‌న్ ఫీట్లు చేయ‌డం ఇష్టం లేకే అని తెలిసింది. అయినా స‌రే ప్ర‌భాస్ తో 4వ భాగాన్ని రూపొందించాల్సిందేన‌ని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ఆదిత్య చోప్రా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. చేయ‌నంటున్నా ప్ర‌భాస్ వెంట‌ప‌డం వృధా ప్ర‌యాస అని బాలీవుడ్ వ‌ర్గాలు ఆదిత్య చోప్రాకు స‌ల‌హా ఇస్తున్నాయ‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All