Homeటాప్ స్టోరీస్మ‌హేష్, ప్ర‌భాస్‌, రామ్ 100 మిలియ‌న్స్ దాటేశారు!

మ‌హేష్, ప్ర‌భాస్‌, రామ్ 100 మిలియ‌న్స్ దాటేశారు!

మ‌హేష్, ప్ర‌భాస్‌, రామ్ 100 మిలియ‌న్స్ దాటేశారు!
మ‌హేష్, ప్ర‌భాస్‌, రామ్ 100 మిలియ‌న్స్ దాటేశారు!

స్టార్ హీరోలు మ‌హేష్‌, ప్ర‌భాస్‌, ఎన‌ర్జిటిక్ హీరో రామ్ సంచ‌ల‌నం సృష్టించారు.  ఈ ముగ్గురు హీరోలు న‌టించిన చిత్రాలు ఇప్ప‌టికే విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్‌ల‌ని సాధించాయి. అయితే ఈ మూవీస్ విడుద‌లై ఏళ్లు గ‌డుస్తున్నా ప్రేక్షకులు మాత్రం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గ‌త కొన్నేళ్ల క్రితం ప్ర‌భాస్ న‌టించిన ఓ చిత్రం యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించ‌గ‌, రామ్ న‌టించిన సినిమా కూడా దాదాపు అదే ఫీట్‌ని రిపీట్ చేసింది.

తాజాగా ఈ జాబితాలోకి మ‌హేష్ న‌టించిన చిత్రం కూడా వ‌చ్చి చేరింది. వివ‌రాల్లోకి వెళితే యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన `రెబ‌ల్‌` చిత్రం కొన్నేళ్ల క్రితం విడుద‌లైనా ఈ చిత్ర ఫైట్స్‌కి, పాట‌ల‌కు ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ సినిమా యూట్యూబ్‌లో 100 మిలియ‌న్ వ్యూస్ దాటడం విశేషం. ఇదే త‌ర‌హాలో రామ్ న‌టించిన `ఇస్మార్ట్ శంక‌ర్ ` సంచ‌ల‌నం సృష్టించింది.

- Advertisement -

ఇక 2015లో విడుద‌లైన మ‌హేష్ చిత్రం `శ్రీ‌మంతుడు`. మ‌హేష్ ఫ్లాపుల్లో వున్న స‌మ‌యంలో తిరుగులేని విజ‌యాన్ని అందించి బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప‌లు రికార్డుల‌తో పాటు అవార్డుల్ని కూడా తెచ్చిపెట్టింది. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో 100 మిలియ‌న్ వ్యూస్ దాటి స‌రికొత్త రిక‌కార్డుని సొంతం చేసుకుంది. అయితే రెబ‌ల్‌, ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాల‌కు సంబంధించిన పాట‌లు, ఫైట్స్‌కి సంబంధించిన వీడియోస్ 100 మిలియ‌న్ వ్యూస్ దాటితే `శ్రీ‌మంతుడు` పూర్తి స్థాయి సినిమా వీక్ష‌ణ‌లో 100 మిలియ‌న్ వ్యూస్ దాట‌డం స‌రికొత్త రికార్డుగా చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All