Homeటాప్ స్టోరీస్మ‌హా స‌ముద్రం: అదితి రావు హైద‌రి ఫస్ట్ లుక్!

మ‌హా స‌ముద్రం: అదితి రావు హైద‌రి ఫస్ట్ లుక్!

మ‌హా స‌ముద్రం: అదితి రావు హైద‌రి ఫస్ట్ లుక్!
మ‌హా స‌ముద్రం: అదితి రావు హైద‌రి ఫస్ట్ లుక్!

శ‌ర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తున్న చిత్రం `మ‌హా స‌ముద్రం`. `Rx100` ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అదితి రావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే శ‌ర్వానంద్‌ ఫ‌స్ట్ లుక్ తో పాటే ఈ మూవీ థీమ్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు.

తాజాగా ఈ చిత్రంలో అదితి రావు హైద‌రి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుద‌ల చేశారు. `అనంత‌మైన ప్రేమ‌..` అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అదితి మ‌హా అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇదే విష‌యాన్ని చిత్ర బృందం తాజాగా సోమ‌వారం ప్ర‌క‌టించారు. మేక‌ర్స్ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ లో అదితి రావు హైద‌రి క‌ళ్ల‌నిండ క‌న్నీటి సంద్రాన్ని నింపుకుని దీనంగా చూస్తున్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

ఈ చిత్రంలోని ఆమె పాత్ర చుట్టూనే క‌థ న‌డుస్తుంద‌ని క్యారెక్ట‌ర్ పేరుని బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది. న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌లో అదితి రావు హైద‌రి క‌నిపించ‌బోతోంది. సినిమాలో ఆమె పాత్ర ఓ హైలైట్‌గా నిలుస్తుంద‌ని టాక్‌. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మించబడుతున్న ఈ మూవీలో అదితి రావు హైద‌రి ఎవరికి జోడీగా క‌నిపిస్తుంద‌న్న‌ది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఆగస్టు 19 న విడుదల చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All