Homeటాప్ స్టోరీస్`మ‌హా స‌ముద్రంలో`చుంచు మామ‌!

`మ‌హా స‌ముద్రంలో`చుంచు మామ‌!

`మ‌హా స‌ముద్రంలో`చుంచు మామ‌!
`మ‌హా స‌ముద్రంలో`చుంచు మామ‌!

శ‌ర్వానంద్, ‌సిద్ధార్ద్ హీరోలుగా న‌టిస్తున్న చిత్రం `మ‌హా స‌ముద్రం`. `Rx 100` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న అజ‌య్ భూప‌తి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అదితీరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లు న‌టిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌కు, యాక్ష‌న్ నేప‌థ్యాన్ని జోడించి పొయెటిక్‌గా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తున్నారు. ఆగ‌స్టు 19న ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఆయ‌న లుక్‌ని, పాత్ర‌ని ప‌రిచ‌యం చేశారు.

- Advertisement -

ఈ మూవీలో జ‌గ‌ప‌తిబాబు `చుంచు మామ‌` అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. మాజీవ్ లుక్‌లో బ్లాక్ చెక్స్ ష‌ర్ట్ వేసుకుని సీరియ‌స్ లుక్‌లో వున్న జ‌గ్గూ భాయ్ ఫొటో ఆక‌ట్టుకుంటోంది. వెన‌కాల శ్రీ‌కృష్ణుడు అర్జునుడి ర‌థాన్ని న‌డుపుతున్న జెండా క‌నిపిస్తోంది. ఆ జెండాకీ , జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌కి సంబంధం వున్న‌ట్ట‌గా క‌నిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All