Homeటాప్ స్టోరీస్42 ఏళ్ల వ‌య‌సులో త‌ల్ల‌యింది!

42 ఏళ్ల వ‌య‌సులో త‌ల్ల‌యింది!

42 ఏళ్ల వ‌య‌సులో త‌ల్ల‌యింది!
42 ఏళ్ల వ‌య‌సులో త‌ల్ల‌యింది!

తాజ్ మ‌హ‌ల్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది సంఘ‌వి. ఆ త‌రువాత తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. 2005 త‌రువాత నుంచి తెలుగు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తోంది. శ‌ర‌త్‌కుమార్‌తో `నాట్ట‌మై` ( ఇదే చిత్రాన్ని తెలుగులో పెద‌రాముడు` గా రీమేక్ చేశారు. చిరంజీవితో `మృగ‌రాజు`, బాల‌కృష్ణ‌తో `స‌మ‌ర‌సింహారెడ్డి`, నాగార్జున‌తో `సీతారారాజు,  వెంక‌టేష్‌తో స‌ర‌దా బుల్లోడు, సూర్య వంశం వంటి హిట్ చిత్రాల్లో న‌టించింది.

2005 త‌రువాత సినిమాల‌కు దూరంగా వున్న సంఘ‌వి బిజినెస్‌మెన్ వెంక‌టేష్‌ని వివాహం చేసుకుంది. అప్ప‌టి నుంచి మీడియాకు కూడా దూరంగా వుంటూ వ‌స్తోంది. గ‌త ఏడాదే మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టింది. స‌ముద్ర‌ఖ‌ని న‌టించిన `కొలాంజి` సినిమాతో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టిన సంఘ‌వి ఇటీవ‌లే ఓ పండంటి పాపు జ‌న్మ‌నిచ్చింది.

- Advertisement -

ఈ విష‌యాన్ని తాజాగా సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ ద్వారా వెల్ల‌డించింది. `షీ ఈజ్ మై లిటిల్ ఏంజిల్` అంటూ త‌న చిన్నారి పాప‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. 42 ఏళ్ల వ‌య‌సులో సంఘ‌వి తల్లి కావ‌డం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All