
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిసతున్న వేళ దేశాలన్నీ లాక్‌డౌన్‌ని ప్రకటించాయి. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ని ప్రకటించారు. ఈ నెల 14కు 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో నిజాముద్దీన్ సంఘటన కలకలం సృష్టించింది. ఏప్రిల్ 14 రకు కాదు 7కే మనం సేఫ్ జజోన్‌లోకి వెళ్లిపోతున్నాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చిన వారితో పరిస్థితి మారింది. అయినా సరే ఎలాంటి భయం వద్దు నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన ప్రజలు పడకుండా కంటిమీద కునుకు వేయకుండా అనునిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం చేస్తున్న కృషికి అన్ని వర్గాల నుంచి హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ కృషికి ముగ్ధుడైన నటుడు, రచయిత ఉత్తేజ్ భావోద్వేగానికి లోనయ్యారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రిని నాయినా అని పిలవాలని వుందని చెప్పడం పలువురిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఉత్తేజ్ వాయిస్‌తో రూపొందించిన వీడియో వైరల్‌గా మారింది.
`నిన్ను నాయినా అని పిలవాలని వుంది పిలవనా.. మొన్ననిన్ను టీవీలో చూసినంక నీ మాటలు ఇన్నంకా నీ చెయ్యితోని మా కండ్ల నీళ్లు తుడిచినట్టు.. మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పినట్టు.. మా ఇంట్లో మనిషివైనట్టు కొట్టిందే. నిన్ను నాయినా అని పిలవాలనుకుంది పిలవనా నాయినా. నిన్ను చూసినా నీ మాటలిన్నా బ్రతుకుమీద నమ్మకం వస్తది.. భయం అన్నది ఆమడ దూరం బోతతి. దేన్నైనా జయిస్తాం అనిపిస్తది. మేం చేసుకున్న అదృష్టమే అది. ఇది నా ఒక్కడి మాట కాదు, తెలంగాణ వాళ్లే కాదు తెలుగు వాళ్లందరి మాట.
తెలంగాణ బిడ్డలే కాదు ఈ గడ్డమీద వున్న ఏ బిడ్డ కూడా ఉపాసం పండొద్దని అమ్మలెక్క అర్సుకున్నవ్ నాయిన లెక్క చూసుకున్నవ్. అప్పుడెప్పుడో ఎనకట శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమెత్తి గోవులను కాపాడినట్టు కరోనా బారిన పడకుండా ఆ గడ్డ మీదున్నోళ్లు ఓటర్లు కాదు మనుషులని కాపాడినవ్. కనపడన వాడు దేవుడైతే నాయినా నువ్వు మాకు కనిపించే దేవునివి. నువ్వు సల్లగుండాలె నాయినా.. నీ కొడుకులు బిడ్డలు సల్లగుండాలే… అంటూ ఉత్తేజ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది… భావోద్వేగభరితంగా సాగిన ఉత్తేజ్ మాటలు నెటిజన్స్‌ని ఎమోషన్‌కు గురిచేస్తున్నాయి.
నిన్ను నాయినా అని పిలువాలనుంది..!
– ఉత్తేజ్ pic.twitter.com/ZgY3LEJw65— Thirupathi bandari (@BTR_KTR) April 16, 2020