
లాక్‌డౌన్ ని మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో మే 3 వరకు ప్రతీ ఒక్కరూ క్వారెంటైన్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇదిలా వుంటే ఈ విపత్కర పరిస్థితుల్లో బయటికి వెళ్లకూడదని ప్రతీ ఒక్కరికి వుంటుంది. కానీ కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు అడుగుపెట్టక తప్పదు. మెడిసిన్స్ కోసమో, నిత్యావసరాల కోసమో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాలపై `హిట్` చిత్ర దర్శకుడు శైలేష్ కొలను ప్రత్యేకంగా ఓ వీడియోని రూపందించాడు.
ఈ వీడియోని ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో పలువురు నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన `హిట్` చిత్రంతో శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయమయ్యారు. కరోనాపై పోరులో `హిట్` అవ్వాలంటే ప్రతీ ఒక్కరు ఈ విధింగా చేస్తే మంచిదని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని మన దేశం నుంచి తరిమేద్దామని, మన దరికి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ `లాక్‌డౌన్ మే 3 వరకు సొడిగించడంతో మనకు ఇంకొన్ని రోజులు ఇబ్బంది తప్పదు. ఈ సమయంలో మెడిసిన్స్ కోసమో, నిత్యావసరాల కోసమో బయటకు వెళ్లాల్సినప్పుడు మనం తెలుసుకోవాల్సినవి చాలా వున్నాయి. గతంలో హెల్త్ కేర్‌కు సంబంధించిన ప్రాక్టీస్ చేశాను. ఆ అనుభవంతోనే వీడియో చేశానని వెల్లడించాడు.