Homeటాప్ స్టోరీస్వ‌ర్మ ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై అదిరింది!

వ‌ర్మ ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై అదిరింది!

వ‌ర్మ ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై అదిరింది!
వ‌ర్మ ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై అదిరింది!

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇ్బందులు త‌లెత్త‌కుండా రెండు ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. పోలీస్ యంత్రాంగం నిద్రాహారాలు మాని ఉభ‌య రాష్ట్రాల ప్ర‌జ‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్నారు. డాక్ట‌ర్లు త‌మ ప్రాణాల్ని ప‌ణంగా పెట్టి త‌మ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తున్నారు.

అంతా బాగానే వుంది. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గుముఖం ప‌డుతోంది. అయితే మందు బాబుల గోల మాత్రం తారా స్థాయికి చేరుతోంది. ఎక్క‌డ ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా దాన్ని ప‌ట్టుకుని ప‌బ్లిసిటీ చేసుకునే వ‌ర్మ క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి వ‌రుస‌గా ట్వీట్‌లు పెడుతూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. తాజాగా మందు బాబుల కోసం ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ప్ర‌శ్న వేశారు.

- Advertisement -

ఆస్క్‌కేటీఆర్‌ పేరుతో మంత్రి కేటీఆర్ ఓ వినూత్న సంప్ర‌దాయానికి తెర‌లేపారు ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ‌ని స‌హాయం అడ‌గొచ్చ‌ని ఆస్క్‌కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్‌ని ప్రారంభించారు. దీనికి తొలిగా వ‌ర్మ స్పందించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, వై.ఎస్‌.జ‌గ‌న్‌ల‌కు నాదో విన్న‌పం. ఎవ‌రైతే బోర్ ఫీల‌వుతూ జుట్టు పీక్కుంటున్నారో, చిన్న పిల్ల‌ల్లాగ ఏడుస్తున్నారో.. ఫ్ర‌స్ట్రేష‌న్‌తో భార్య‌ల‌ని కొడుతున్నారో..అలాంటి వారి కోసం మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి మంచి హృద‌యం వుంటుంద‌ని ఆశిస్తున్నా` అని ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ నుంచి వ‌చ్చిన రిప్లై అదిరింది. `వ‌ర్మ‌గారూ హెయిర్ క‌ట్ గురించే అడుగుతున్నారు క‌దా..` అని చ‌మ‌త్క‌రించారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All