Homeటాప్ స్టోరీస్పుష్పరాజ్ కు ఆచార్య పోటీగా వెళ్తాడా?

పుష్పరాజ్ కు ఆచార్య పోటీగా వెళ్తాడా?

పుష్పరాజ్ కు ఆచార్య పోటీగా వెళ్తాడా?
పుష్పరాజ్ కు ఆచార్య పోటీగా వెళ్తాడా?

కరోనా రెండు వేవ్స్ కారణంగా సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో పూర్తిగా కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెల్సిందే. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి భారీ చిత్రాలు రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తున్నాయి కానీ దానికి తగ్గట్లుగా రియాలిటీ ఉండట్లేదు. ప్రస్తుతం సంక్రాంతి 2022కు మూడు చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ ను ప్రకటించాయి. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ చిత్రాలు సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించాయి.

అయితే దసరాకు రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ విడుదలలో జాప్యం ఉండే అవకాశముంది. దసరా నుండి సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ మారబోతోందని సమాచారం. ఇదే కనుక జరిగితే సంక్రాంతి రిలీజ్ లలో మళ్ళీ షఫ్లింగ్ ఉండే అవకాశముంది. మరోవైపు ఆచార్య ఎప్పుడు విడుదలవుతుంది అన్న కన్ఫ్యూజన్ కూడా కొనసాగుతోంది. క్రిస్మస్ కు ఆచార్యను తీసుకురావాలని భావిస్తున్నారు.

- Advertisement -

అయితే క్రిస్మస్ కే అల్లు అర్జున్ పుష్ప కూడా విడుదలకు సిద్ధమైంది. మరి పుష్ప కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందా? ఏమో ప్రస్తుతానికంతా కన్ఫ్యూజన్ మాత్రమే ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All