Homeటాప్ స్టోరీస్ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది ఆరోజేనా?

ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది ఆరోజేనా?

ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది ఆరోజేనా?
ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది ఆరోజేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ఆచార్య. ఈ చిత్ర టైటిల్ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నా ఇటీవలే ఓ పిట్ట కథ ఆడియో వేడుకలో చిరంజీవి అనుకోకుండా టైటిల్ ను రివీల్ చేసిన సంగతి తెల్సిందే. టైటిల్ మీద సస్పెన్స్ వీడిపోవడంతో ఇప్పుడంతా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఇప్పటిదాకా రెండు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. మొదటిది ఖైదీ నెం 150 రీమేక్ కాగా, రెండోది సైరా నరసింహారెడ్డి. 12 ఏళ్ల తన కలను ఈ చిత్రం ద్వారా తీర్చుకున్నాడు చిరంజీవి. అయితే ఈసారి పక్కా కమర్షియల్ అంశాలున్న చిత్రంతోనే వస్తున్నాడు. కొరటాల శివకు కమర్షియల్ మీటర్ తెలుసు. సామజిక అంశాలను చొప్పిస్తూనే కమర్షియల్ గా ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కించడంలో కొరటాల శివ శైలి వేరు.

- Advertisement -

ఇప్పటిదాకా శివ తెరకెక్కించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లు కావడంతో ప్రస్తుతం చిరంజీవితో చేస్తున్న చిత్రంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపిస్తాడని అంటుంటే లేదు యూనియన్ లీడర్ అని మరో వార్త వినిపిస్తోంది. అలాగే ఇది 90ల కాలంలో నడిచే కథ అని కూడా అంటున్నారు. అయితే ఎన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నా కానీ చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు.

ఇక ఈ చిత్రంలో ఉండే స్పెషల్ రోల్ విషయంలో కూడా మనం ఇప్పటికే చాలా రూమర్స్ విన్నాం. రామ్ చరణ్ ఈ పాత్రలో నటిస్తాడని, లేదు మహేష్ బాబు కనిపిస్తాడని అంటున్నారు. ఈ పాత్ర నక్సలైట్ అని కొందరు అంటుంటే మహేష్ కోసం స్టూడెంట్ లీడర్ గా మార్చినట్లు తెలుస్తోంది.

ఇవి ఇలా ఉంటే హోలీకి ఈ చిత్రానికి సంబంధించిన ఏదొక విశేషముంటుందని అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు. ఇప్పుడు ఉగాది సందర్భంగా ఆచార్య ఫస్ట్ లుక్ తో పాటు పలు విశేషాలను చిత్ర యూనిట్ తెలియజేస్తుంది అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All