HomeVideos'#69 సంస్కార్ కాలనీ’ ట్రైలర్‌ టాక్..ఏంటి సామీ ఈ అరాచకం..

‘#69 సంస్కార్ కాలనీ’ ట్రైలర్‌ టాక్..ఏంటి సామీ ఈ అరాచకం..

'#69 సంస్కార్ కాలనీ’ ట్రైలర్‌ టాక్..ఏంటి సామీ ఈ అరాచకం..
‘#69 సంస్కార్ కాలనీ’ ట్రైలర్‌ టాక్..ఏంటి సామీ ఈ అరాచకం..

ఈ మధ్య తెలుగు సినిమాలు హాలీవుడ్ సినిమాలను మించి ఉంటున్నాయి. అంటే కథో ..బడ్జెటో అనుకోకండి శృంగార సన్నివేశాల గురించి చెపుతున్నాం. కొన్ని చిన్న సినిమాల నిర్మాతలు , దర్శకులు తమ సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలతో నింపేసి, ప్రేక్షకులను థియేటర్స్ కు పరుగులుపెట్టేలా చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ ను మసాలా సన్నివేశాలతో నింపి, సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా విడుదలైన #69 సంస్కార్ కాలనీ’ ట్రైలర్‌ కూడా అదే జాబితాలో ఉంది. ట్రైలర్ మొత్తం కూడా బూతు సన్నివేశాలు , లిప్ లాక్ లతో నింపేశారు.

సింగర్ నోయల్ మాజీ భార్య, హీరోయిన్ ఎస్తేర్ నటించిన ఈ చిత్రాన్ని  ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి రూపొందించారు. ఈ చిత్రంలో ఎస్తేర్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. రిష్విక్ తిమ్మరాజు, అజయ్, శిల్పా నాయక్ ఇతర పాత్రల్లో నటించారు. మార్చి 4 థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం ట్రైలర్ రిలీజ్ చేసారు.

- Advertisement -

ట్రైలర్ లో ఎస్తేర్ రెచ్చిపోయింది. లిప్ లాక్ , బెడ్ సీన్లలో మాములుగా చేయలేదు. గతంలో ఆమె భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయిక, గరం వంటి చిత్రాల్లో నటించినప్పటికీ వాటిలో కాస్త పద్దతిగానే కనిపించింది. కానీ ఈ మూవీ లో మాత్రం రెచ్చిపోయి నటించింది. ఈ ట్రైలర్ చూసిన జనాలు వామ్మో ఇది తెలుగు సినిమానా..బోల్డ్ సినిమానా అంటూ కామెంట్స్ వేస్తున్నారు. ఇక మీరు కూడా ఈ హాట్ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All