Homeటాప్ స్టోరీస్FCUK టీజ‌ర్‌: అమ్మాయిల‌తో త‌ండ్రీ కొడుకుల రొమాన్స్‌

FCUK టీజ‌ర్‌: అమ్మాయిల‌తో త‌ండ్రీ కొడుకుల రొమాన్స్‌

FCUK టీజ‌ర్‌: అమ్మాయిల‌తో త‌ండ్రీ కొడుకుల రొమాన్స్‌
FCUK టీజ‌ర్‌: అమ్మాయిల‌తో త‌ండ్రీ కొడుకుల రొమాన్స్‌

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `FCUK` (ఫాద‌ర్ – చిట్టి-ఉమ‌- కార్తీక్‌). విద్యాసా‌గ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ‌రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబీ శ్రీ‌హ‌ర్షిత కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర ప్ర‌సాద్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల ప్ర‌ధాన పాత్ర‌ల ప్ర‌చార చిత్రాల్ని విడుద‌ల చేసిన చిత్ర బృందం నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా శుక్ర‌వారం FCUK టీజ‌ర్‌ని రిలీజ్ చేసింది. ఇందులో ఫ‌ణి భూపాల్ అనే రొమాంటిక్ ఫాద‌ర్ పాత్ర‌లో జ‌గ్గూ భాయ్ జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నారు. రాముడి బాణం వేగం గాలికి కూడా తెలియ‌దంట‌..అంతే ఫాస్ట్‌గా ఇత‌గాడు అమ్మాయిల్ని ప‌డేస్తుంటాడ‌ని టీజ‌ర్‌లో చూపించారు.

- Advertisement -

ఇక కొడుకు విష‌చ‌యానికి వ‌స్తే పేరు కార్తీక్‌..ఈయ‌నో పెద్ద ఫ్ల‌ట్ మాస్ట‌ర్‌. ఇత‌నికి త‌గిలే అమ్మాయే ఉమ.. ఈవిడో పిల్ల‌ల డాక్ట‌ర్‌. .. త‌ల్లిని తెస్తా త‌ల్లిని తెస్తాన‌ని చెల్లిని తీసుకొచ్చావేంటి నాన్నా..బండి ఇంకా కండీష‌న్‌లోనే వుందంకుల్‌.. ఆడాళ్ల‌డిగితే కాదంటామా.. ఇచ్చేస్తాం.. లాంటి డైలాగ్‌లు సినిమా ఏంటీ.. దీని క‌థేంటి? అన్న‌ది తెలిసిపోతోంది. ఈ నెల‌లోనే ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. చాలా రోజుల త‌రువాత జ‌గ‌ప‌తిబాబు త‌న పాత్ర‌ని ఓ రేంజ్‌లో ఆడుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All