
నటసింహం నందమూరి బాలకృష్ణ పై సెటైర్ వేసాడు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి . తెలుగుదేశం పార్టీ ఎం ఎల్ ఏ లమైన మేము ప్రజలకు బంట్రోతులమే అంటూ బాలయ్య ఆవేశంగా పోస్ట్ పెట్టడమే ఈ వివాదానికి కారణం అయ్యింది . ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఎన్నిక సందర్బంగా స్పీకర్ తమ్మినేని సీతారాం ని స్పీకర్ చెయిర్ వద్దకు తోడ్కొని వెళ్లే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వెళ్లకుండా తెలుగుదేశం నుండి ఇద్దరు ప్రతినిధులను పంపాడు దాంతో ఈ వివాదం ముదిరింది .
బాలయ్య బంట్రోతులమే అనే డైలాగ్ కొట్టడంతో దానికి కౌంటర్ గా అవును మీరు బంట్రోతులే మహిళా తహసీల్దార్ ని ఇసుకలో పడేసి కొట్టిన ఎం ఎల్ ఏ బంట్రోతే , ఆశా చెల్లెళ్లను బూతులు తిట్టిన వ్యక్తి కూడా సేవకుడే ,ప్రజలను హింసించి వందల కోట్లు టాక్స్ వసూల్ చేసిన వారు స్పీకర్ గా చేసిన పెద్ద బంట్రోతు సంతానమే కదా ! అంటూ రివర్స్ ఎటాక్ చేసాడు బాలయ్య మీద విజయసాయి రెడ్డి .