Homeటాప్ స్టోరీస్అరవింద సమేత కథపై వివాదం

అరవింద సమేత కథపై వివాదం

young writer shocking comments on director trivikramఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత కథ పై వివాదం నెలకొంది . అరవింద సమేత కథ నాదేనని వేంపల్లి గంగాధర్ అనే రచయిత సోషల్ మీడియాకు ఎక్కాడు . దర్శకులు త్రివిక్రమ్ నన్ను మోసం చేసాడని అయితే కథ నాది తీసుకొని కనీసం పేరు కూడా వేయలేదని అతడు పెద్ద దొంగ అంటూ అరవింద సమేత చిత్రంలోని ముఖ్య కాన్సెప్ట్ లను వివరిస్తూ మరీ ఫేస్ బుక్ లోకి ఎక్కేసాడు గంగాధర్ అనే రచయిత. త్రివిక్రమ్ నన్ను పిలిపించుకొని మరీ మూడు రోజుల పాటు అన్ని వివరాలు తీసుకున్న తర్వాత నా కథలను పక్కగా మార్చుకొని రూపొందించిన చిత్రమే ఈ అరవింద సమేత వీర రాఘవ అంటూ అసలు విషయాన్నీ చెబుతున్నాడు .

అయితే గంగాధర్ చెబుతున్నది నిజమేనా ? త్రివిక్రమ్ అతడి కథలను దొంగిలించి అరవింద సమేత కథ రాసుకున్నడా ? ఇత్యాది విషయాలన్నీ చెప్పాల్సింది దర్శకులు తివిక్రమే ! త్రివిక్రమ్ నోరు తెరిస్తే కానీ అసలు నిజం తెలియదు . ఇంతకుముందు అజ్ఞాతవాసి చిత్రానికి కూడా కాపీ కథనాలు వచ్చాయి అయితే వాటిని మాత్రం కొట్టిపడేసాడు త్రివిక్రమ్ . ఇప్పటికి కూడా అజ్ఞాతవాసి చిత్ర కథ నాదే కాపీ కొట్టలేదని అంటున్నాడు . ఇక ఈ అరవింద కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .

- Advertisement -

English Title: young writer shocking comments on director trivikram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All