Homeటాప్ స్టోరీస్యాత్ర టీజర్ విడుదల

యాత్ర టీజర్ విడుదల

yatra teaser outఈరోజు దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ” యాత్ర ” టీజర్ ని విడుదల చేసారు . మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్న చిత్రం ” యాత్ర ”. వై ఎస్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి . పాదయాత్ర చేస్తూ తెలుగునాట ప్రభంజనం సృష్టించాడు వై ఎస్సార్ దాంతో అదే వృత్తాన్ని ఎంచుకొని యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ముఖ్యమంత్రి గా అయిదున్నర సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించాడు వై ఎస్సార్ .

మహి వి రాఘవ దర్శకత్వంలో విజయ్ చిల్లా శశి దేవి రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈరోజు వై ఎస్ జన్మదినం కావడంతో రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను అలరించేలా ఉంది దాంతో ఈ బయోపిక్ కూడా హిట్ అవుతుందేమో అనిపిస్తోంది . మమ్ముట్టి వై ఎస్ పాత్రలో సరిగా సెట్ అయ్యాడు . అచ్చల్ వై ఎస్ ని తలపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నాడు . ఇక ఈ సినిమాని ఎన్నికల ముందు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దాని వల్ల కొంత లాభం పొందొచ్చని భావిస్తున్నారు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు .

- Advertisement -

వై ఎస్ తెలుగునాట చెరగని ముద్ర వేసాడు . ఎన్టీఆర్ తర్వాత ప్రజలతో అంతగా మమేకం అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ లా జనరంజకమైన పాలన అందించాడు అందుకే వై ఎస్ ఆర్ అనగానే ప్రజలు ఇప్పటికి కూడా భావోద్వేగానికి లోనయ్యే వాళ్ళున్నారు .

English Title: yatra teaser out

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All