
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదితో 46వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు మహేష్. లుక్స్ పరంగా చూసుకుంటే మహేష్ ఇంకా 20లలో ఉన్నాడేమో అనిపిస్తుంది. అది వేరే విషయం లెండి. ఇదిలా ఉంటే మహేష్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీస్ అందరూ విష్ చేస్తున్నారు. ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మహేష్ ను చిరు “ఎవర్ గ్రీన్ ఛార్మర్” అని సంబోధించడం కొసమెరుపు. ఎన్టీఆర్ మహేష్ ను హ్యాపీ బర్త్ డే అన్నా అని విష్ చేసాడు. ఇక ఈరోజు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు దాదాపు 20 మంది సెలబ్రిటీలు ట్విట్టర్ స్పేస్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడనున్నారు. తెలుగు స్పేస్ ల పరంగా ఇదే అతిపెద్దది.
మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది అక్టోబర్ నుండి మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను స్టార్ట్ చేసాడు మహేష్.
Wishing you a very Happy Birthday @urstrulyMahesh anna!! Have a great year ahead
— Jr NTR (@tarak9999) August 9, 2021
Happy Birthday to the Evergreen Charmer SSMB @urstrulyMahesh ! A lethal combo of Style and Substance! Have a Blockbuster year ahead! ???????? Many Many Happy Returns!
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2021