Homeటాప్ స్టోరీస్తెలుగు సినిమా స్థాయిని పెంచే విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా స్థాయిని పెంచే విజయ్ దేవరకొండ

Will Vijay Deverakonda changed the face of Telugu cinemaతెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది , గతకొంత కాలంగా విభిన్న తరహా చిత్రాలను చేస్తూ యువ దర్శకులు , నటీనటులు తమ ప్రతిభను చాటుతున్నారు . ఇప్పటికే పలువురు తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించగా హీరోగా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకుంటూ ఒక్కో శిఖరం ఎక్కుతూ స్టార్ లీగ్ లో చేరిపోయాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ . అయితే విజయ్ దేవరకొండ హీరో మాత్రమే కాదు అంతకుమించిన నటుడు కూడా . థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో విజయ్ దేవరకొండ నటిస్తుంటే అది ఏ పాత్ర అయినప్పటికీ అక్కడ పాత్ర మాత్రమే కనబడుతుంది , పాత్ర స్వభావం మేరకు నటిస్తాడు తప్ప హీరో కనిపించడు .

మూసలో వెళుతున్న తెలుగు సినిమాకు విజయ్ దేవరకొండ చుక్కాని లా ముందుండి నడిపిస్తాడా ? అంటే అవుననే అంటున్నారు . విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చేసిన చిత్రాలు ,ఆ చిత్రాల్లో చూపించిన అభినయం చూడముచ్చటగా ఉండటంతో అతడి సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి . తాజాగా చిన్న చిత్రంగా విడుదలైన గీత గోవిందం సంచలన విజయం సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది . విభిన్న తరహా పాత్రలను పోషిస్తూ రేసులో ముందుకు దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ మునుముందు తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఖాయమని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు , అలాగే విజయ్ దేవరకొండ అభిమానులు .

- Advertisement -

English Title: Will Vijay Deverakonda changed the face of Telugu cinema

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All