
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. థియేటర్లలో మంచి టాక్ తో ఆడుతోన్న ఈ చిత్రం కోవిద్ కారణంగా ముందే ఫైనల్ రన్ కు చేరుకోవాల్సి వచ్చింది. ఇటీవలే ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం మళ్ళీ పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. అందరూ వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రతిభను పొగుడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రను తీర్చిదిద్దిన విధానానికి ఫిదా అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ కు కూడా వేణు శ్రీరామ్ ప్రతిభ బాగా నచ్చింది. తనతో కంఫర్ట్ ఫీల్ అయిన పవన్, మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. దిల్ రాజు కూడా పవన్ తో మరో సినిమా కోసం ఒప్పించాడు. ఈ నేపథ్యంలో పవన్ ప్రస్తుత కమిట్మెంట్స్ అన్నీ పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేసే వీలుంది.
ఈలోగా వేణుశ్రీరాం ఐకాన్ డైరెక్ట్ చేద్దామనుకున్నా కానీ అల్లు అర్జున్ సిద్ధంగా లేడు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం వేణు శ్రీరామ్ ఎన్ని ఏళ్ళు వెయిట్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.