Homeటాప్ స్టోరీస్డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో నిర్మాతలు ఇకనైనా చిత్తశుద్ధితో ఉంటారా?

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో నిర్మాతలు ఇకనైనా చిత్తశుద్ధితో ఉంటారా?

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో నిర్మాతలు ఇకనైనా చిత్తశుద్ధితో ఉంటారా?
డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో నిర్మాతలు ఇకనైనా చిత్తశుద్ధితో ఉంటారా?

డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడిప్పుడే మన నిర్మాతలకు అర్ధమవుతున్నాయి. విడుదలైన నెల రోజులకే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ సైట్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లలో ప్రత్యక్షమవుతుంటే ఇక థియేటర్ లో ఎవరు అడుగుపెడతారు? ఇందుకోసమే గతంలో నిర్మాతలు అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చారు.

సినిమా రిలీజ్ డేట్ కి, డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కు కనీసం ఆరు నెలలు గ్యాప్ ఉండేలా చూసుకుందామని తీర్మానించుకున్నారు. అయితే వీటిపై ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా మన నిర్మాతలు నెల రోజులకే సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేసుకునేందుకు అనుమతినిచ్చారు. నాని గ్యాంగ్ లీడర్ 27 రోజులకే ప్రైమ్ లో దర్శనమిచ్చింది. చిన్న సినిమాలు అయితే మూడు వారాలకే ప్రైమ్ లో ఉంటున్నాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సాటిలైట్ రిలీజ్ అయిన తర్వాతే డిజిటల్ రిలీజ్ లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అల వైకుంఠపురములో పోస్టర్ లో అయితే “ఈ చిత్రాన్ని మీరు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో చూడలేరు” అని వేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనివల్ల భారీగా నష్టపోతున్న థియేటర్లు, ఎగ్జిబిటర్లకు కొంత ఊరట కలగడం ఖాయం. మరి ఈ నిర్ణయాన్ని మిగతా సినిమాల నిర్మాతలు కూడా అవలంబిస్తారా అన్నది డౌటే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All