Homeటాప్ స్టోరీస్ప్లాప్ డైరెక్టర్ ఆ హీరో కు హిట్ ఇస్తాడా

ప్లాప్ డైరెక్టర్ ఆ హీరో కు హిట్ ఇస్తాడా

will prabhas get success with flop director యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రం ప్లాప్ డైరెక్టర్ అయిన జిల్ రాధాకృష్ణ తో పని చేయాలనీ తహతహ లాడుతున్నాడట ! ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆగస్టు లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే ని తీసుకున్నారు . ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎక్కువగా విదేశాలలోనే చిత్రీకరించనున్నారు , ఇక ఈ చిత్రాన్ని ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు నిర్మించనున్నాడు .

రాధాకృష్ణ ఇంతకుముందు ” జిల్ ” చిత్రానికి దర్శకత్వం వహించాడు . గోపీచంద్ హీరోగా నటించిన జిల్ ప్లాప్ అయ్యింది అయితే ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ ప్రభాస్ కు చెప్పిన కథ నచ్చడంతో రెండో ఛాన్స్ ఇచ్చాడు . బాహుబలి తో ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా మారిపోయింది అయితే దానికి తగ్గట్లుగా కథలు ఎంచుకోకుండా , పెద్ద దర్శకులతో కాకుండా ఇద్దరు అంతగా పేరు లేని కొత్త దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు దాంతో ట్రేడ్ విశ్లేషకులతో పాటుగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు . మరి ప్రభాస్ ధైర్యం చేసి ఛాన్స్ ఇచ్చిన ఈ దర్శకులు ప్రభాస్ కు హిట్స్ ఇస్తారా చూడాలి ? ముఖ్యంగా రాధాకృష్ణ ప్లాప్ డైరెక్టర్ మరి ప్రభాస్ కు హిట్ ఇస్తాడా ?

- Advertisement -

English Title: will prabhas get success with flop director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All