Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కు కూడా ఆ హీరోయినే కావాలట

ప్రభాస్ కు కూడా ఆ హీరోయినే కావాలట

prabhas eyes on pooja hegdeఅందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే కి లక్ బాగానే ఉంది ఎందుకంటే ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు కానీ తాజాగా మాత్రం ఈ భామకి అదృష్టం దరిద్రం లెక్కనే పట్టింది . అగ్ర హీరోలు ఎన్టీఆర్ , మహేష్ బాబు ల చిత్రాల్లో ఈ భామ నటించే ఛాన్స్ కొట్టేసింది , అంతేకాదు తాజాగా ప్రభాస్ కు కూడా ఈభామే కావాలట ! ప్రభాస్ ఒకవైపు సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నాడు అది పూర్తికాకుండానే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .

 

- Advertisement -

ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నారట ! బాహుబలి తో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది . దాంతో పూజా హెగ్డే కు దశ తిరిగినట్లే ! ఒకవైపు మహేష్ బాబు , ఎన్టీఆర్ లతో ప్రభాస్ సరసన కూడా నటించే ఛాన్స్ అంటే ఇక పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ అయిపోయినట్లే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All