Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ రికార్డుల మోత మోగించనున్నాడా?

ఎన్టీఆర్ రికార్డుల మోత మోగించనున్నాడా?

Will ntr joins 100 crores club యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో రికార్డుల మోత మోగించనున్నాడా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. దసరా కానుకగా అక్టోబర్11 న సినిమా విడుదల అవుతుండటం ఒక కారణమైతే , దసరా సందర్భంగా 11 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించడం మరో కారణం . అసలే ఎన్టీఆర్ అంటే మాస్ హీరో దాంతో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. భారీ ఓపెనింగ్స్ కి తోడు దసరా సెలవులు వచ్చాయి కాబట్టి పది రోజుల్లోనే అవలీలగా వంద కోట్లని రాబట్టడం ఖాయం. ఇక సినిమా ఏమాత్రం బాగున్నా అంతకుమించి వసూల్ చేయడం ఖాయం.

మొదటి వారంలోనే వంద కోట్లకు పైగా వసూళ్లు వస్తాయి , ఆ తర్వాత మిగతా మూడు రోజుల్లో మరో 20, 30 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. అంటే మొత్తంగా పది రోజుల్లో అరవింద బాగుందని టాక్ వస్తే 150 కోట్ల మైలురాయిని చేరుకున్నా చేరుకోవచ్చు. భారీ వసూళ్లు సాధించడానికి బాగా స్కోప్ ఉంది ఎన్టీఆర్ కు. ఒకవేళ సినిమా బాగోలేకపోతే మాత్రం దెబ్బపడటం ఖాయం . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అరవింద సమేత లో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించింది. వంద కోట్ల షేర్ ని ఇంతవరకు ఎన్టీఆర్ సాధించలేదు అయితే ఆ అవకాశం ఈ హీరోకు ఇప్పుడు వచ్చింది. మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడా ? లేదా ? చూడాలి.

- Advertisement -

English Title: Will ntr joins 100 crores club

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All