Homeటాప్ స్టోరీస్చైతన్య సవ్యసాచితో హిట్ కొడతాడా ?

చైతన్య సవ్యసాచితో హిట్ కొడతాడా ?

Will nagachaitanya gets hit with savyasachiఅక్కినేని నాగచైతన్య కు యాక్షన్ హీరోగా ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశ కానీ ఇంతవరకు అలా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పాపం సరైన హిట్ కొట్టలేకపోయాడు . అపుడెపుడో తడాకా చిత్రంతో హిట్ కొట్టాడు చైతూ కానీ ఆ సినిమా హిట్ అయినప్పటికీ నాగచైతన్య కోరుకున్న యాక్షన్ ఇమేజ్ రాలేదు ఎందుకంటే యాక్షన్ కోసం చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . దాంతో అతడి ఆశ అడియాస అయ్యింది . అయినప్పటికీ నాగచైతన్య మాత్రం యాక్షన్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతూనే ఉన్నాడు పాపం . తాజాగా సవ్యసాచి అనే సినిమా చేసాడు . చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సవ్యసాచి నవంబర్ 2 న విడుదల కానుంది .

ఈ చిత్రం మీద చాలా నమ్మకంగా ఉన్నాడు నాగచైతన్య . సవ్యసాచి తో హిట్ కొట్టి యాక్షన్ హీరోగా టర్న్ కావాలని చూస్తున్నాడు . అక్కినేని హీరోలకు యాక్షన్ హీరో గుర్తింపు రాలేదు . నాగార్జున కొంత పవర్ చూపించాడు కానీ రొమాంటిక్ హీరోగానే ఎక్కువ గుర్తింపు వచ్చింది . మరి నాగచైతన్య కు కూడా యాక్షన్ ఇమేజ్ వచ్చేలా లేదు కానీ ప్రయత్నం అయితే మానడం లేదు . సవ్యసాచి పై అంచనాలు బాగానే ఉన్నాయి . మరి ఆ అంచనాలను అందుకొని హిట్ అవుతుందా ? లేదా ? అన్నది నవంబర్ 2 న తేలనుంది .

- Advertisement -

English Title: Will nagachaitanya gets hit with savyasachi

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All