Homeటాప్ స్టోరీస్సవ్యసాచి ట్రైలర్ టాక్

సవ్యసాచి ట్రైలర్ టాక్

Nagachaitanya's Savyasachi trailer talkఅక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి చిత్రం విడుదలకు సిద్దమయ్యింది . చందు మొండేటి దర్శకత్వంలో భారీ చిత్రాల సంస్థ మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది . ఇక ఈ చిత్రంలో విశేషం ఏంటంటే తమిళ కథానాయకుడు మాధవన్ నటించడం . మాధవన్ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే ! అయితే నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం మాత్రం ఇదే కావడం , ఇదే అతడికి తెలుగులో మొదటి చిత్రం కావడం విశేషం . ఈరోజు సవ్యసాచి ట్రైలర్ ని విడుదల చేసారు . ఆ ట్రైలర్ టాక్ ఎలా ఉందో ఓసారి చూద్దామా !

ఎడమచేతి వాటంతో నాగచైతన్య పడే తిప్పతలతో నాగార్జున నటించిన హలో బ్రదర్ ని కాస్త గుర్తు చేసాడు నాగచైతన్య . ఇక ఆద్యంతం ట్రైలర్ ఓ విభిన్న కథా చిత్రమని చెప్పకనే చెబుతోంది . యాక్షన్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ ని అలాగే థ్రిల్ ని కలిగిస్తోంది సవ్యసాచి చిత్రం . మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా సినిమా హిట్ అనేలా ఉంది దాంతో చైతూ చాలా సంతోషంగా ఉన్నాడు , నమ్మకంగా ఉన్నాడు . నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటించగా కీలక పాత్రలో భూమిక నటించింది . ఇక ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 2 న విడుదల కానుంది .

- Advertisement -

English Title: Nagachaitanya’s Savyasachi trailer talk

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All