Homeటాప్ స్టోరీస్హిట్ కొట్టే సత్తా ఆ డైరెక్టర్ లో ఉందా ?

హిట్ కొట్టే సత్తా ఆ డైరెక్టర్ లో ఉందా ?

Will Krishna Vamsi get success with Natsamrat remakeదర్శకులు కృష్ణవంశీ ది ప్రత్యేక శైలి అన్న విషయం అందరికీ తెలిసిందే . క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు రేసులో లేకుండాపోయాడు . సినిమా నిండా మనుషులను నింపేసే ఈ దర్శకుడు తీసే చిత్రాలకు బడ్జెట్ ఎక్కువ అవ్వడం , ఆ స్థాయిలో బిజినెస్ జరగకపోవడం …… సినిమా విడుదలై ఘోర పరాజయం పొందుతుండటంతో కృష్ణవంశీ తో సినిమాలు చేసే నిర్మాతలు కరువయ్యారు . దాంతో కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండిపోయాడు కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఓ సినిమాకు శ్రీకారం చుట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

సినిమాలు చేయకుండా ఉంటె మొదటికే మోసం కాబట్టి మరాఠీ భాషలో విడుదలై సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ చిత్రాన్ని టాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు . నానాపటేకర్ నటించిన పాత్రని తెలుగులో ప్రకాష్ రాజ్ చేత చేయించాలని భావిస్తున్నాడు కృష్ణవంశీ . ప్రకాష్ రాజ్ కు కృష్ణవంశీ కి మంచి స్నేహం ఉంది దాంతో కృష్ణవంశీ ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించాడట ప్రకాష్ రాజ్ . అయితే హిట్ సినిమా ఎలా ఉంటుందో అన్నది తెలీక దాదాపు దశాబ్దం పైనే . మరి అలాంటి స్థితిలో హిట్ కొట్టే సత్తా ఈ డైరెక్టర్ లో ఉందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న .

- Advertisement -

English Title: Will Krishna Vamsi get success with Natsamrat remake

Image result for Will Krishna Vamsi get success with Natsamrat remake

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All