Homeటాప్ స్టోరీస్నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో @నర్తనశాల చిత్రం ప్రారంభం

నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో @నర్తనశాల చిత్రం ప్రారంభం

ira-creations-nagashourya-s-narthanasala-movie-openingఛలో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథుల సమక్షంలో ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వంశీ పైడి పల్లి, నందిని రెడ్డి, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. వంశీ పైడి పల్లి హీరో నాగశౌర్యపై క్లాప్ కొట్టారు.

శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, జెమిని సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో

- Advertisement -

 

హీరో నాగశౌర్య మాట్లాడుతూ…. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఛలో చిత్రంతో మాకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ప్రేక్షకులకు మాకు ఫుల్ సపోర్ట్ చేసిన మీడియా వారికి మా థాంక్స్. ఎట్ ది రేట్ ఆఫ్ నర్తనశాల చిత్రంతో శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమౌతున్నారు. కృష్ణవంశీ దగ్గర ఆయన పనిచేశారు. ఈ సినిమా తర్వాత ఆయన కచ్చితంగా పెద్ద దర్శకుడు అవుతారు. మా సంస్థ నుంచి మరో కొత్త డైరెక్టర్ ను పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా డెసిషన్ ను నమ్మిన మా అమ్మకు థాంక్స్. ఇక ఈ చిత్రం డ్యాన్స్ బేస్ డ్ చిత్రం అని, పాత నర్తనశాల రీమేక్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానే కాదు. ఇది ఫుల్ ఎంటర్ టైనర్. నవ్వుకునే చిత్రం. హీరోయిన్స్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక చూసి చూడంగానే సాంగ్ తో ఛలో చిత్రానికి సూపర్బ్ సాంగ్ ఇచ్చిన మహతి మరోసారి అంతకంటే అద్భుతమైన పాటలిస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. ఇక ఎడిటర్ చంటి గారు మా ఫ్యామిలీలో కలిసి పోయారు. ఎడిటింగ్ లో ఆయన ఏది చెబితే అదే ఫైనల్ మాకు. ఇక డిఓపి విజయ్ గారితో చాలా సార్లు కలిసి వర్క్ చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. మా బ్యానర్లో కలిసి వర్క్ చేయడం చాలా బాగుంది. నిర్మాత మా అమ్మకు స్పెషల్ థాంక్స్. రెండో సినిమాకు కూడా బయటి వారిని కాకుండా నన్నే హీరోగా పెట్టినందుకు. అని అన్నారు.

 

దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ… తల్లితండ్రులు, భగవంతుడి తర్వాత నేను ముందుగా నాగశౌర్యకు… నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉష గారికి చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే… ఈ తరహా కథని పర్ ఫెక్ట్ గా జడ్జ్ చేసి సినిమా చేద్దామని ఒప్పుకున్నారు. నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా చేద్దాం అన్నప్పటి నుంచి ఐరాలో ఫ్యామిలీ మెంబర్ అయ్యాను. ఐరాలో ఆల్రెడీ ఛలో అనే పెద్ద హిట్ ఉంది. దాన్ని మించేలా సినిమా రూపొందిస్తానని మాటిస్తున్నాను. నాకు పెద్ద పెద్ద టెక్నీషిన్స్ ని ఇచ్చారు. చాలా థాంక్స్. అని అన్నారు.

 

ఎడిటర్ చంటి, డిఓపీ విజయ్ సి కుమార్ మాట్లాడుతూ… ఐరా క్రియేషన్స్ లో ఛలో సూపర్ హిట్ అయ్యింది. అలాగే నర్తనశాల కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. అని అన్నారు.

 

ఐరా క్రియేషన్స్ డిజిటల్ హెడ్ ఎం.ఎన్.ఎస్.గౌతమ్ మాట్లాడుతూ… ఛలో చిత్రంతో మా ఐరా క్రియేషన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. దానికి ఆడియెన్స్ కు, మీడియాకు స్పెషల్ థాంక్స్. @నర్తనశాల చిత్రం సైతం మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అని అన్నారు.

నటీనటులు
నాగశౌర్య, నరేష్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, జెమిని సురేష్ తదితరులు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All