Homeటాప్ స్టోరీస్పవన్ సినిమాతో అక్షయ్ హిట్ కొడతాడా.?

పవన్ సినిమాతో అక్షయ్ హిట్ కొడతాడా.?

పవన్ సినిమాతో అక్షయ్ హిట్ కొడతాడా.?
పవన్ సినిమాతో అక్షయ్ హిట్ కొడతాడా.?

సినిమా చరిత్రలో చాలా సినిమాలు ముందు ఒక బాషలో వచ్చి, ఇండస్ట్రీ హిట్ అయ్యి , తరువాత అనేక భాషల్లో డబ్బింగ్, రీమేక్ చెయ్యబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఒరిజినల్ కి మించి డబ్బింగ్ లేదా రీమేక్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు అమితాబ్ బచ్చన్ హిందీలో చేసిన “డాన్” సినిమా అనేకసార్లు రీమేక్ చెయ్యబడింది. తెలుగులో ఎన్టీఆర్ దగ్గర నుండి ప్రభాస్ వరకూ, తమిళంలో అజిత్ వరకూ ఈ సినిమాను మళ్ళీ, మళ్ళీ కొద్దిమార్పులతో చేసిన వాళ్ళే.ఇక చంద్రముఖి సినిమా విషయానికి వస్తే, ఒరిజినల్ సినిమాలు అయిన మనుచిత్ర తాజు, మరియు ఆప్త మిత్ర సినిమాల కంటే మించి బ్లాక్ బస్టర్ అయ్యింది. రజనీ మ్యాజిక్ అన్నిటినీ డామినేట్ చేసింది.

ఇప్పుడు తమిళంలో శివ గారు “తాలా” అజిత్ కుమార్ తో “వీరమ్” అనే సినిమా చేసారు. ఆ సినిమా పెద్ద హిట్టు. ఆ వెంటనే అజిత్ – శివ కాంబినేషన్ లో వేదాలం, వివేకం, విశ్వాసం లాంటి సినిమాలు వచ్చేసాయి. ఇక గబ్బర్ సింగ్ హిట్ తరువాత స్ట్రైట్ సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ “వీరం” సినిమాను తెలుగులో “కాటమరాయుడు” గా రీమేక్ చేసారు. అయితే ఈ సినిమా తెలుగులో పవర్ స్టార్ స్థాయికి తగిన సినిమా అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ తన రీఎంట్రీకి కూడా పింక్ రీమేక్ పైనే డిపెండ్ అయ్యాడు. అయితే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ “వీరం” సినిమాను “బచ్చన్ పాండే” గా రీమేక్ చేస్తున్నాడు. గతంలో కూడా అక్షయ్ రౌడీ రాథోర్ (విక్రమార్కుడు), భూల్ భులయియా (చంద్ర ముఖి) రీమేక్ లతో హిట్లు కొట్టాడు. లారెన్స్ కాంచన సినిమాను కూడా అక్షయ్ రీమేక్ చేస్తున్నాడు. ఇక హిట్టు, ఫ్లాపు లతో సంబంధం లేకుండా ఏడాదికి మినిమం 3 – 4 సినిమాలతో బాక్సాఫీస్ ను కళకళలాడేలా చేస్తున్నాడు అక్షయ్. ఇక మూవీ లవర్స్ అందరూ కూడా అక్షయ్ సినిమా అంటే ఎక్కడా తగ్గదని ఫిక్స్ అయిపోయారు. ఆమీర్ ఖాన్ “లాల్ చడ్డా” కోసం అక్షయ్ “బచ్చన్ పాండే” ను జనవరి 22 కి వాయిదా వేసుకున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All