
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రెండేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `వకీల్ సాబ్`. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజుతో కలిసి బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. రెండవ వారం నుంచి పవన్ ఈ మూవీ షూట్లో పాల్గొనబోతున్నారు.
ఇదిలా వుంటే సోమవారం కన్నడ హీరో సుదీప్ జనపేనాని ప్రత్యేకంగా కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ని సుదీప్ ప్రత్యేకంగా కలుసుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య గంట పాటు చర్చ జరిగిందట. అయితే అది సినిమాల గురింయచి మాత్రమేని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సుదీప్ పవన్‌కు మొక్కలు అందించారు.
కోవిడ్ అన్‌లాక్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో తను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ పవన్‌కు వివరించారట. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారని, వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారని మీడియాకు వ్యక్తం చేశారు. అయితే సుదీప్ కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. పవన్ కూడా బీజేపీకి సపోర్ట్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణం వల్లే ఈ హీరోలిద్దరు ప్రత్యేకంగా కలుసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.