
గత ఏడు నెలలుగా కరోనా కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. దీంతో స్టార్ హీరోల చిత్రాలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం ఆన్‌లాక్ ప్రక్రియలో భాగంగా మళ్లీ షూటింగ్‌లు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్‌లు కూడా సెట్‌లో సందడికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొంత మంది కోవిడ్ నిబంధనల్ని అనుసరించి షూటింగ్ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మూవీ `వకీల్ సాబ్` షూటింగ్ కూడా మొదలైంది. కానీ ఇందులో పవన్ పాల్గొనడం లేదు. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలకమైన కోర్టు ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి పవన్ సెట్‌లోకి ఎంటర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో బయటికి వచ్చిన పవన్ లుక్‌కి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
గత కొన్ని రోజులుగా చతుర్మాస దీక్షలో వున్న పవన్ తాజాగా `వకీల్ సాబ్` లుక్‌లోకి మారిపోవడం ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతలో పవన్ లుక్‌లో ఇంత మార్పా అని అంతా అవాక్కవుతున్నారు. ట్రిమ్ చేసిన గడ్డంతో స్లిమ్‌గా మారిన పవన్ లుక్ ఆకట్టుకుంటోంది.