Homeగాసిప్స్బ్లాక్ బస్టర్ దర్శకుడికి ఈ కష్టాలేంటి?

బ్లాక్ బస్టర్ దర్శకుడికి ఈ కష్టాలేంటి?

బ్లాక్ బస్టర్ దర్శకుడికి ఈ కష్టాలేంటి?
బ్లాక్ బస్టర్ దర్శకుడికి ఈ కష్టాలేంటి?

ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్సకుడికి మరో సినిమా సెట్ చేసుకోవడం ఎంత సేపు? అతని చుట్టూ నిర్మాతలు క్యూ కడతారు. ముందు మా అడ్వాన్స్ తీసుకోండంటే మాది తీసుకోండి అంటూ ఇబ్బంది పెట్టేస్తారు. హీరోలు కూడా తమకు సూట్ అయ్యే కథలేమైనా ఉన్నాయా అని కబురంపుతారు. నచ్చిన కథ ఉంటే వెంటనే లాక్ చేసుకుంటారు. ఈరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి ఉండే వేల్యూ అది. ఇంకా అర్ధం కాకపోతే అనిల్ రావిపూడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎఫ్ 2 తో బాక్స్ ఆఫీస్ బద్దలైపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందించాడు. దిల్ రాజు కెరీర్ లో అత్యధిక లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా ఎఫ్ 2 రికార్డు సృష్టించింది. ఆ సినిమా రిలీజైన కొన్ని నెలలకే సూపర్ స్టార్ మహేష్ బాబు పిలిచి మరీ అవకాశమిచ్చాడు. తనకు సరిపోయే కథతో వస్తే వెంటనే డేట్స్ ఇస్తాడని ఆఫర్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి మహేష్ ను మెప్పించాడు. అలా సరిలేరు నీకెవ్వరు పట్టాలెక్కుతోంది. ఇప్పటిదాకా మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన అనిల్ రావిపూడి ఒక్కసారిగా టాప్ రేంజ్ కు చేరుకున్నాడు.

ఇప్పుడర్ధమైందిగా బ్లాక్ బస్టర్ దర్శకుడికున్న డిమాండ్. మరి గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తీసిన పరశురామ్ ఏడాది దాటుతున్నా కూడా ఎందుకనో మరో చిత్రాన్ని మాత్రం సెట్ చేసుకోలేకపోతున్నాడు. పరశురామ్ కు గీతా ఆర్ట్స్ బ్యాకింగ్ ఉంది. ఏ హీరోతో వచ్చినా సినిమాను నిర్మించడానికి వారు రెడీగా ఉన్నారు. అయినా కూడా అతను ఇంతవరకూ సినిమాను ఎందుకని ప్రకటించట్లేదు. అప్పట్లో మహేష్ బాబుతో పరశురామ్ ఉంటుందని అన్నారు. దాని తర్వాత కొన్ని రోజులకు ఎటువంటి హడావిడి లేదు. ప్రభాస్ తో సినిమా అని కూడా వార్తలొచ్చాయి. గీతా ఆర్ట్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. ఇది కూడా తర్వాత చడీ చప్పుడు చేయలేదు. మధ్యలో అఖిల్ తో చిత్రమని నాగార్జున స్వయంగా నిర్మించడానికి ముందుకు వస్తున్నాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం అఖిల్ ప్లాపులలో ఉండడంతో పరశురామ్ వంటి సెన్సిబుల్ దర్శకుడైతే బెటర్ అని నాగార్జున అభిప్రాయపడినట్లు వార్తలొచ్చాయి. ఇక లాస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ పరశురామ్ దర్శకత్వంలో ఉంటుంది కూడా అన్నారు. కానీ అది ఒట్టి పుకారేనని త్వరగానే తేలిపోయింది.

- Advertisement -

ఇన్ని వార్తలు వస్తున్నా పరశురామ్ ఎందుకని సినిమాను సెట్ చేసుకోలేకపోతున్నాడన్నది అంతు చిక్కని ప్రశ్న. నిజంగా పరశురామ్ మహేష్, ప్రభాస్, అఖిల్, పవన్ ల కోసం కథలు సిద్ధం చేసి వాళ్ళని మెప్పించడంలో విఫలమయ్యాడా? లేక అవన్నీ ఒట్టి రూమర్సేనా? అసలు పరశురామ్ ఇంతవరకూ ఏ కథా సిద్ధం చేయలేదా? పరశురామా, మార్కెట్ అంతా నీకు పాజిటివ్ గా ఉన్న టైమ్ లో ఇలా సినిమాను ఆలస్యం చేసి ఉన్న పాజిటివిటీని పోగొట్టుకోకు. త్వరగా ఏదొక అనౌన్స్మెంట్ ఇవ్వు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All