Homeటాప్ స్టోరీస్షార్ట్ నిక్కరుతో సామ్..రచ్చ రచ్చ

షార్ట్ నిక్కరుతో సామ్..రచ్చ రచ్చ

షార్ట్ నిక్కరుతో సామ్..రచ్చ రచ్చ
షార్ట్ నిక్కరుతో సామ్..రచ్చ రచ్చ

విడాకుల తర్వాత సమంత కు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు అయ్యింది. తనకు నచ్చిన కథలో నటిస్తూ..ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ..ఏది అంటే అది చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్ గా పుష్ప మూవీ ఐటెం సాంగ్ చేసి పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

ఈ రెండు కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధముగా ఉన్నాయి.రీసెంట్ గా BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ లో నటిస్తుంది. దీంతో పాటు ‘యశోద’ అనే పాన్ ఇండియా మూవీలోనూ ప్రధాన పాత్ర చేస్తోంది.

- Advertisement -

ఇలా వరుస మూవీస్ లలో బిజీ గా ఉంటూనే..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తాజాగా సామ్ ఓ జలపాతం దగ్గర బుల్లి నిక్కరు వేసుకుని దిగిన ఫొటోలను షేర్ చేసింది. ప్రకృతి అందాలను చూస్తూ కనిపించింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All