Homeటాప్ స్టోరీస్వైజాగ్‌పై విషం చిమ్మిన ఎల్‌జీ పాలిమ‌ర్స్‌

వైజాగ్‌పై విషం చిమ్మిన ఎల్‌జీ పాలిమ‌ర్స్‌

vizag gas leakage incident 8 peoples dead
vizag gas leakage incident 8 peoples dead

క‌రోనా కార‌ణంగా వ‌ర‌ల్డ్ వైడ్‌గా విప‌త్క‌ర ప‌రిస్థితులు నెల‌కొని భ‌యాన‌‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన నేప‌థ్యంలో విశాఖ‌పై ఎల్‌జీ పాలిమ‌ర్స్ విష‌యం చిమ్మ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. విశాఖ న‌గ‌రంలోని గోపాల‌ప‌ట్నం ప‌రిధి ఆర్. ఆర్. వెంక‌టాపురంలోని ఎల్‌.జీ పాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ‌లో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప‌రిశ్ర‌మ నుంచి ర‌సాయ‌న వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాప్తించింది.

పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చ‌ర్మంపై ద‌ద్దుర్లు, క‌ళ్ల‌లో మంట‌లు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులతో స్థాయికులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అప‌స్మార‌క స్థిదిలో ర‌హ‌దారిపై ప‌డిపోయిన కొంద‌రిని అంబులెన్స్‌లో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌తో త‌లుపులు వేసుకొని ఇళ్ల‌లోనే ఉండిపోయారు.

- Advertisement -

సైర‌న్ మోగించి ఇళ్ల‌ను ఖాలీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప‌రిశ్ర‌మకు ఐదు కిలోమీట‌ర్ల ప‌రిధిలో వున్న ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ఇళ్ల నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించారు. 25 అంబులెన్స్‌లు, పోలీసు వాహ‌నాల ద్వారా అస్వ‌స్థ‌ల‌కు గురైన వారిని విశాఖ కేజీహెచ్‌కు త‌ర‌లిస్తున్నారు.
సింహాచ‌లం డిపో నుంచి ఆర్టీసీ బ‌స్సులను తీసుకొచ్చి ప‌రిశ్ర‌మ‌కు ఐదుకిలోమీట‌ర్ల ప‌రిధిలో వున్న వారిని త‌ర‌లిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌పై చిత్ర ప‌రిశ్ర‌మ‌మ‌కు చెందిన మెగాస్టార్ చిరంజీవి, మ‌మేష్‌బాబు, బాబి, నాని, వ‌రుణ్‌తేజ్‌, అనిల్ రావిపూడి, ద‌ర్శ‌కుడు మారుతి, నాగ‌శౌర్య‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ స్పందించారు. విశాఖ‌లో విష వాయువు బారిన ప‌డి ప్ర‌జ‌లు మ‌ర‌ణించ‌డం మ‌న‌సుని క‌ల‌చివేసింద‌ని, మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాన‌ని, అస్వ‌స్థ‌త‌కు గురైన వారంద‌రూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని చిరంజీవి ట్వీట్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All