Homeటాప్ స్టోరీస్మాస్ కా బాప్ వ‌చ్చేశాడు..ఎన్టీఆర్‌కు విశ్వ‌క్‌సేన్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్!

మాస్ కా బాప్ వ‌చ్చేశాడు..ఎన్టీఆర్‌కు విశ్వ‌క్‌సేన్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్!

మాస్ కా బాప్ వ‌చ్చేశాడు..ఎన్టీఆర్‌కు విశ్వ‌క్‌సేన్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్!
మాస్ కా బాప్ వ‌చ్చేశాడు..ఎన్టీఆర్‌కు విశ్వ‌క్‌సేన్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్!

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో నంద‌మూరి అభిమానుల హంగామా న‌డుస్తోంది. దీనికి స‌మాంత‌రంగా ఇండ‌స్ట్రీ స్టార్‌లు కూడా ఎన్టీఆర్‌పై అభినంద‌న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్‌పై త‌మ‌కున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ కూడా ఎన్టీఆర్‌ని అభిమానిస్తుంటారు. ఇదే విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు కూడా.

తాజాగా ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భాంగా ప్ర‌త్యేకంగా ఓ వీడియోని రూపొందించారు. ఆ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. మాస్ కా బాప్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో పాత‌బ‌స్తీ స్టైల్లో స‌రికొత్త‌గా సాగింది. విశ్వ‌క్‌సేన్ ఓ అభిమాని‌గా రూపొందించిన ఈ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

విశ్వ‌క్‌సేన్ ప్ర‌స్తుతం బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్న `పాగ‌ల్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రం కోసం విశ్వ‌క్‌సేన్ ఓ పాట కూడా పాడ‌టం విశేషం. లాక్‌డౌన్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. షూటింగ్‌ల‌పై ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన వెంట‌నే షూటింగ్ ప్రారంభించాల‌నుకుంటున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All