Homeటాప్ స్టోరీస్స‌మ్మ‌ర్‌కే వ‌స్తానంటున్న విశ్వ‌క్‌సేన్ `పాగ‌ల్`!

స‌మ్మ‌ర్‌కే వ‌స్తానంటున్న విశ్వ‌క్‌సేన్ `పాగ‌ల్`!

స‌మ్మ‌ర్‌కే వ‌స్తానంటున్న విశ్వ‌క్‌సేన్ `పాగ‌ల్`!
స‌మ్మ‌ర్‌కే వ‌స్తానంటున్న విశ్వ‌క్‌సేన్ `పాగ‌ల్`!

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ `హిట్‌`తో సూప‌ర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం `పాగ‌ల్‌`. విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌హ‌కారంతో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్‌ని చిత్ర బృందం మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

- Advertisement -

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ యూబ‌ర్ కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్‌లో గులాబీ పూలు క‌నిపిస్తున్నాయి. పాగ‌ల్ ప్రేమికుడి క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్నారు. ‌మ‌ణికంద‌న్ ఫొటోగ్ర‌ఫీ, గ్యారీ బీహెచ్, పాట‌లు రామ‌జోగ‌య్య, కెకె, కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, ఫైట్స్ దిలీప్ సుబ్బ‌రాయ‌న్, స్టోరీ, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం న‌రేష్ కుప్పిలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All