Homeటాప్ స్టోరీస్సింగ‌ర్‌గా మారుతున్న యంగ్ హీరో!

సింగ‌ర్‌గా మారుతున్న యంగ్ హీరో!

సింగ‌ర్‌గా మారుతున్న యంగ్ హీరో!
సింగ‌ర్‌గా మారుతున్న యంగ్ హీరో!

యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం `పాగ‌ల్‌`. ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మార్చిలో ఈ చిత్రం లాంచ‌నంగా పూజా కార్యక్ర‌మాలు జ‌రుపుకుంది. 21 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా దెబ్బ‌తో ప్లాన్ అంతా తారుమారైంది.

తాజాగా `హిట్‌` సినిమాతో స‌క్సెస్‌ని సొంతం చేసుకున్న విశ్వ‌క్‌సేన్ తాజా చిత్రం `పాగ‌ల్‌`పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్నార‌ట‌. మ‌రింత కొత్త‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మ‌ణికండ‌న్ ఛాయాగ్ర‌హ‌ణ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం విశ్వ‌క్‌సేన్ సింగ‌ర్ అవ‌తారం ఎత్తార‌ట‌.

- Advertisement -

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. ఈ సినిమా కోసం తాను ఓ పాట పాడాన‌ని. ఇప్ప‌టికే దాన్ని రికార్డ్ కూడా చేశామ‌ని, విశ్వక్‌సేన్ అంటే మంచి న‌టుడ‌ని, ఓ స్టార్ హీరో అని అనిపించుకోవాల‌ని వుంద‌ని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All