Homeగాసిప్స్సెన్సేష‌న‌ల్ హిట్‌కి సీక్వెల్ చేస్తాడ‌ట‌!

సెన్సేష‌న‌ల్ హిట్‌కి సీక్వెల్ చేస్తాడ‌ట‌!

సెన్సేష‌న‌ల్ హిట్‌కి సీక్వెల్ చేస్తాడ‌ట‌!
సెన్సేష‌న‌ల్ హిట్‌కి సీక్వెల్ చేస్తాడ‌ట‌!

య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన చిత్రం `Rx 100`. కార్తికేయ గుమ్మ‌కొండ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రీమేక్ అవుతోంది. హిందీలో సునీల్‌శెట్టి త‌న‌యుడు అహ‌న్ శెట్టిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ హాటీ తారా సుతారియా హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

త‌మిళంలో, క‌న్న‌డ‌లోనూ రీమేక్ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. వాస్త‌విక కోణంలో స‌హ‌జ‌త్వానికి అత్యంత ద‌గ్గ‌ర‌గా రూపొందిన ఈ చిత్రం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి నిర్మాత‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ని చేయాల‌ని ద‌ర్‌శ‌కుడు అజ‌య్ భూప‌తి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

ప్ర‌స్తుతం అజ‌య్ భూప‌తి `మ‌హా స‌ముద్రం` పేరుతో ఓ యాక్ష‌న్ డ్రామాని తెర‌పైకి తీసుకురాబోతున్నాడు. ఇందులో శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్నారు. కార్తికేయ గుమ్మ‌కొండ కూడా ఇందులో ఓ హీరోగా న‌టిచే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఈ సినిమా పూర్తియిన త‌రువాతే `Rx 100`కు సీక్వెల్‌ని రూపొందిస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన క‌థ‌ని ద‌ర్శ‌కుడు సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All