
`RX100` చిత్రంతో సంచలనం సృష్టించిన హాట్ ఆటమ్ బాంబ్ పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న తాజా చిత్రానికి `5Ws` who, what, when, where, why (ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సాధారణ ప్రశ్నలు.. అసాధారణ సమాధానాలు అని ఉపశీర్షిక. గుణశేఖర్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వం శాఖలో పనిచేసిన ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ ఐపీఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. కైవల్య క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. `ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి మౌనంగా వున్నాను. `5Ws` నాకు, నా కెరియర్‌కి కంప్లీట్ కొత్త సినిమా. పోలీస్ పాత్రల్లో నటించాలని ప్రతీ ఒక్కరు కలలుకంటారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ నాకు లభించింది. నాపై, నా నటనపై నమ్మకం వుంచిన దర్శకుడు ప్రదీప్‌గారికి థ్యాంక్స్. ఐపీఎస్ పాత్రలో నటించడం ఓ సవాల్. బాగా చేశానని అనుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్‌తో సినిమా చేశా. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నా.ఈ పాత్ర చేయడానికి నాకు విజయశాంతిగారు స్ఫూర్తి` అని పాయల్ రాజ్‌పుత్ తెలిపింది.
ఇదొక ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పోలీసులు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసినా ఉవరు? ఏమిటి ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అని ఆరాతీస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథని రాశా. రెగ్యులర్ పోలీస్ స్టోరీలా కాకుండా హ్యుమన్ వేల్యూస్, సెంటిమెంట్‌ని జోడించి ఈ చిత్రాన్ని చేశాం. పాయల్‌కు కొత్త సినిమా అవుతుంది` అని దర్శకుడు తెలిపారు.