Homeటాప్ స్టోరీస్మంచు విష్ణు ష‌ర్ట్ విప్పేశాడండోయ్‌!

మంచు విష్ణు ష‌ర్ట్ విప్పేశాడండోయ్‌!

మంచు విష్ణు ష‌ర్ట్ విప్పేశాడండోయ్‌!
మంచు విష్ణు ష‌ర్ట్ విప్పేశాడండోయ్‌!

ష‌ర్ట్ విప్పి హంగామా చేయ‌డం కేవ‌లం బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్ కే సొంతం. కండ‌లు చూపిస్తూ ష‌ర్ట్ లేకుండా హీరోయిన్ల‌ని ఫ్లంట్ చేస్తుంటాడు స‌ల్లూభాయ్‌. ఇది ఒక‌ప్ప‌టి మాట‌. సీన్ మారింది. ఇప్ప‌డు ప్ర‌తీ హీరో ష‌ర్ట్ విప్పేసి కండ‌లు చూపిస్తున్నాడు. తాజాగా మ‌న టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా ష‌ర్ట్ విప్పేసి షాకిచ్చాడు. `ఓట‌ర్‌` త‌రువాత తీవ్ర నిరాశ‌కు గురైన మంచు విష్ణు కొంత విరామం త‌రువాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం `‘మోసగాళ్లు’ చిత్రంలో న‌టిస్తున్న ఆయ‌న దర్శకుడు శ్రీను వైట్లతో క‌లిసి `ఢీ`కి సీక్వెల్ గా  డి అండ్ డి – డబుల్ డోస్’ పేరుతో ఓ మూవీని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీని ప్ర‌క‌టించారు.  యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్నారు.  యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డంతో ఈ మూవీ కోసం చ‌మ‌టోడుస్తున్నారు. స‌రికొత్త మేకోవ‌ర్ కోసం వ‌ర్క‌వుట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ష‌ర్ట్ విప్పి త‌న కూతురు ఐరాతో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చారు మంచు విష్ణు అదే ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట వైర‌ల్ అవుతోంది. మంచు విష్ణు న‌టిస్తున్న ‘డి అండ్ డి – డబుల్ డోస్’ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All