Homeటాప్ స్టోరీస్పైరసీ బారిన పడిన పందెం కోడి 2

పైరసీ బారిన పడిన పందెం కోడి 2

Vishal's Pandem kodi 2 online leaked విశాల్ నటించిన పందెం కోడి 2 చిత్రం పైరసీ బారిన పడింది . నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన పందెం కోడి 2 చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది అయితే తమిళనాట మాత్రం ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . అక్కడ హిట్ దిశగా దూసుకుపోతోంది పందెం కోడి 2 చిత్రం . అయితే ఊహించినట్లుగానే పందెం కోడి 2 చిత్రం ఇలా విడుదల అయ్యిందో లేదో వెంటనే ఆన్ లైన్ లో మొత్తం సినిమా లీక్ అయ్యింది . కోట్ల కొద్ది పెట్టి తీస్తున్న సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయని తెలిసి వాటిని అరికట్టడానికి విశాల్ ఎన్నో చర్యలు తీసుకున్నాడు కానీ విశాల్ తీసుకున్న జాగ్రత్తలు అన్ని బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది .

తమిళనాట పైరసీ పెద్ద ఎత్తున జరుగుతోందని తెలిసి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని షాక్ అవుతున్నాడు విశాల్ . సినిమా మొత్తం పైరసీ బారిన పడటంతో వెంటనే అప్రమత్తమయ్యాడు విశాల్ . కానీ అప్పటికే ఆలస్యం అయిపొయింది . పైరసీ మ్యాటర్ ఎలా ఉన్నప్పటికీ పందెం కోడి 2 చిత్రానికి అనుకున్న స్థాయిలో ఫలితం రావడం లేదు తెలుగులో . తమిళనాట మాత్రం హిట్ అయ్యే సూచనలు ఉన్నాయి . విశాల్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది . లింగుస్వామి దర్శకత్వం వహించగా విశాల్ నిర్మించాడు ఈ చిత్రాన్ని .

- Advertisement -

English Title: Vishal’s Pandem kodi 2 online leaked

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All