Homeటాప్ స్టోరీస్పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన విశాల్‌!

పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన విశాల్‌!

పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన విశాల్‌!
పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన విశాల్‌!

యాక్ష‌న్ చిత్రాల హీరో విశాల్ త‌న‌పై గ‌త కొంత కాలంగా వ‌స్తున్న పెళ్లి వార్త‌ల‌పై స్పందించారు. యాక్ష‌న్ చిత్రాల్లో న‌టిస్తూ త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో మాస్ హీరోగా మంచి గుర్తింపుని ద‌క్కించుకున్నారు. `పెళ్లిచూపులు`, `అర్జున్‌రెడ్డి` చిత్రాల ఫేమ్ అనీషా రెడ్డిని గ‌తంలో వివాహం చేసుకుంటున్నాన‌ని వెల్ల‌డించిన విశాల్‌.. ఆమెతో ఆ మ‌ధ్య ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు.

కానీ మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ వీరి పెళ్లి అర్థాంత‌రంగా ఆగిపోయింది. పెళ్లికి సంబంధించి ఎలాంటి న్యూస్ బ‌య‌టికి రాలేదు. ఇంత‌కీ వీరి పెళ్లి జ‌రుగుతుందా?  లేదా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇదిలా వుంటే తాజాగా త‌న పెళ్లి వార్త‌ల‌పై హీరో విశాల్ స్పందించారు. ప్ర‌స్తుతానికి తాను సింగిల్ గానే వున్నాన‌ని, వేరొక‌రితో రిలేష‌న్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేన‌ని చెప్పారు.

- Advertisement -

అంతే కాకుండా తాను విధిని న‌మ్ముతాన‌ని, కాబ‌ట్టి దేవుడు ఎలాంటి రాత‌రాస్తే జీవితం అలా కొన‌సాగుతుంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు అలాగే కొన‌సాగింద‌ని చెప్పారు. త్వ‌ర‌లో శుభ‌వార్త చెప్పాల‌ని రాసిపెట్టివుంటే త‌ప్ప‌కుండా అంద‌రికీ చెబుతాన‌ని విశాల్ ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. విశాల్ న‌టించిన తాజా చిత్రం `చ‌క్ర‌` ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All