
విశాల్ నటిస్తున్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్ `చక్ర`. రెజీనా కసాండ్రా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఎం.ఎస్. ఆనందన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని విశాల్ ప్లాన్ చేశారు. దీపావళికి చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. రానీ కథ అడ్డం తిరిగింది.
ఈ చిత్ర రిలీజ్‌ని నిలిపి వేయాలంటూ `యాక్షన్` చిత్ర నిర్మాత మద్రాసు హై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ చిత్ర రిలీజ్ నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విశాల్ `చక్ర` రిలీజ్ ప్రశ్నార్థకంలో పడిపోయింది. `యాక్షన్` సినిమా ద్వారా నష్టాలని చవిచూసిన నిర్మాత రవీంద్రన్ కు అదుపరి చిత్రం మీ సంస్థకే చేస్తానని విశాల్ మాటిచ్చారట. అయితే ఇచ్చిన మాటని నిలెట్టకోకపోగా తన సొంత సంస్థలో `చక్ర`ని నిర్మించారు.
దీంతో ఆగ్రహానికి గురైన నిర్మాత రవీంద్రన్ తనకు నష్టపరిహారాన్ని చెల్లించాలరి, ఆ తరువాతే `చక్ర`ని రిలీజ్ చేయాలని కోర్టు కెక్కారు. దీంతో వివాదం మొదలైంది. అయితే తాజాగా మరోసారి వాదనలు విన్న కోర్టు `చక్ర` మూవీ రిలీజ్‌ని ఎక్కువ కాలం ఆపలేమని స్పష్టం చేశారట. దీంతో `చక్ర`ని దీపావళికి ఓటీటీతో పాటు థియేటర్లలోనూ రిలీజ్ చేసేందుకు విశాల్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం.