Homeటాప్ స్టోరీస్ఈ రెండు చిత్రాల్లో హిట్ అయ్యేది ఏదో ?

ఈ రెండు చిత్రాల్లో హిట్ అయ్యేది ఏదో ?

Vishal and Ram figts for successఈరోజు రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి . ఒకటి విశాల్ హీరోగా నటించిన పందెం కోడి 2 , రామ్ హీరోగా నటించి హలో గురూ ప్రేమకోసమే . అయితే ఈ రెండు చిత్రాల గురించి కూడా పెద్దగా బజ్ లేదు కాకపోతే విశాల్ నటించిన పందెం కోడి 2 కి మాత్రం కాస్త అంచనాలు ఉన్నాయి . పందెం కోడి సూపర్ హిట్ తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం కావడంతో పందెం కోడి 2 పై అంచనాలు ఏర్పడ్డాయి అయితే రామ్ నటించిన హలో గురూ ప్రేమకోసమే చిత్రానికి అస్సలు బజ్ లేదు . ఆ సినిమాని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు . కాకపోతే దసరా సెలవులు కాబట్టి తప్పకుండా రెండు చిత్రాలకు ఓపెనింగ్స్ ఉంటాయి . ఇక సినిమా బాగుంటే క్యాష్ చేసుకునే అవకాశం ఉంది .

అయితే ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది . రామ్ సినిమా ప్రేమ కథా చిత్రంగా అర్ధం అవుతోంది , ప్రేమ కథా చిత్రం కాబట్టి యువత ఎలాగూ రామ్ సినిమాకు ప్రాధాన్యత ఇస్తుంది . సినిమా బాగుంటే హిట్ …… లేదంటే వచ్చిన దారినే వెళ్లి పొమ్మా ! అంటూ పంపిస్తారు . ఇక విశాల్ సినిమా మాస్ కాబట్టి బిసి కేంద్రాల్లో బాగా ఉండొచ్చు . మాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా ఉందట పందెం కోడి 2 దాంతో పెద్ద హిట్ అవుతుందని ధీమాగా ఉన్నాడు విశాల్ . దసరా బరిలో దిగిన రెండు చిత్రాల్లో ప్రేక్షకులను అలరించే సినిమా ఏది అవుతుందో తెలియాలంటే కొద్దిసేపు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -

English Title: Vishal and Ram fight for success

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All