
`కేజీఎఫ్` బ్లాక్ బస్టర్ తరువాత కన్నడ స్టార్ హీరోలు టాలీవుడ్‌పై కన్నేశారు. కన్నడలో ఏ సినమా చేసినా అది తెలుగులో ఖచ్చితంగా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే బాటలో కన్నడ హీరో కిచ్చయా సుదీప్ కూడా తన సూపర్ హీరో మూవీ `విక్రాంత్ రోణ`ని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై శాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా నీతా అశోక్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. హీరో కిచ్చా సుదీప్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ స్నీక్‌పీక్‌ని బూర్జ్ ఖలీఫాపై ఆవిష్కరించారు. బూర్జ్ ఖలీఫా టవర్ మొత్తం కిచ్చా సుదీప్ వీడియో ఆవిషృతం కావడం అన్నది వరల్డ్ మొత్తంలోనే తొలిసారి కావడంతో ఇదొక రికార్డుగా నమోదైంది. దీంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సూపర్ హీరో మూవీగా రూపొందుతున్న ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 19న రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్‌ని హీరో కిచ్చా సుదీప్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 3డీ ఫార్మాట్‌లో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `మొన్నటి వరకు షూటింగ్ సంబరం…ఇప్పుడు రిలీజ్ మరో కొత్త ఉత్సాహం… ఈ ఆగష్టు 19న `విక్రాంత్ రోణ`తో మీ ముందుకు వస్తున్నాం`. అని హీరో కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు.
మొన్నటివరకు షూటింగ్ సంబరం…
ఇప్పుడు రిలీజ్ మరో కొత్త ఉత్సాహం…
ఈ ఆగష్టు 19న #VikrantRona తో మీ ముందుకు వస్తున్నాం…
???????? pic.twitter.com/UnKEmKt8ay— Kichcha Sudeepa (@KicchaSudeep) April 15, 2021