Homeటాప్ స్టోరీస్డైరెక్టర్ పై ఫైర్ అయిన స్టార్ హీరో ఫ్యాన్స్

డైరెక్టర్ పై ఫైర్ అయిన స్టార్ హీరో ఫ్యాన్స్

hero shiva rajkumar fans angry on director premకన్నడ నాట ఇద్దరు హీరోలతో సినిమా చేస్తూ అభిమానుల చేత తిట్లు తింటున్నాడు దర్శకుడు ప్రేమ్ . తమ హీరోకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని ఆగ్రహిస్తూ దర్శకుడు ప్రేమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అభిమానులు . కన్నడంలో శివరాజ్ కుమార్ సూపర్ స్టార్ అన్న విషయం తెలిసిందే , కాగా తెలుగులో ఈగ చిత్రంలో నటించిన విలన్ కిచ్చా సుదీప్ కూడా అక్కడ అగ్ర హీరోనే !ఈ ఇద్దరి కాంబినేషన్ లో ” ది విలన్ ” అనే చిత్రం చేస్తున్నాడు ప్రేమ్ .

కాగా ది విలన్ చిత్రం లోని టీజర్ ని ఇటీవల విడుదల చేసారు అయితే సుదీప్ కి ఇచ్చిన ప్రాధాన్యత మా హీరో శివరాజ్ కుమార్ కు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్శకుడు ప్రేమ్ ని తిడుతున్నారు అభిమానులు . మా హీరో స్టార్ హీరో అలాంటిది ఆయన్ని తక్కువ చేసి చూపిస్తారా ? టీజర్ లోనే ఇలా తక్కువ చేసి చూపిస్తే , సినిమాలో ఎలా చూపించారో ? మా హీరోని ఇంతగా అవమానిస్తారా ? అంటూ నిప్పులు చెరుగుతున్నారు శివరాజ్ కుమార్ అభిమానులు .

- Advertisement -

శివరాజ్ కుమార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు కి షాక్ అయిన ప్రేమ్ వెంటనే స్పందించి అసలు నేను ఏ పొరపాటు కూడా చేయలేదు రేపు సినిమా చూసాక తప్పు చేసానని అనుకుంటే నేను దేనికైనా సిద్ధమని విన్నవించు కుంటున్నాడు , కానీ ఫ్యాన్స్ మాత్రం అతడి మాటలను వినడమే లేదు . ది విలన్ సినిమా విడుదల అయితే కానీ ఈ వివాదం ఓ కొలిక్కి రాదనుకుంటా !

English Title:hero shiva rajkumar fans angry on director prem

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All