Homeటాప్ స్టోరీస్2 రోజుల్లో 110 కోట్లు రాబట్టిన సర్కార్

2 రోజుల్లో 110 కోట్లు రాబట్టిన సర్కార్

Vijay's Sarkar 2 days world wide collectionsఇళయ దళపతి విజయ్ నటించిన సర్కార్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ భారీ ఓపెనింగ్స్ ని మాత్రం రాబట్టింది . కేవలం రెండు రోజుల్లోనే 110 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది . రాజకీయ నేపథ్యంలో రూపొందిన సర్కార్ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముడుతుండగా తాజాగా మరో వివాదం కూడా రాజుకుంది సర్కార్ చిత్రానికి . అయితే ఎలాంటి వివాదాలు వస్తున్నప్పటికీ అవి సర్కార్ కు మరిన్ని వసూళ్లు పెంచేలా చేస్తున్నాయి తప్ప తగ్గించడం లేదు . మొదటి రోజున 67 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా రెండో రోజున 43 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది దాంతో రెండు రోజుల్లో 110 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధ్యమయ్యాయి .

ఇక ఈ జోరు ఇలాగే కొనసాగడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ విజయ్ మాస్ హీరో అందునా తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే ఈ వసూళ్లు వస్తున్నాయి కానీ ఈరోజు నుండి వసూళ్లు పడిపోవడం ఖాయం ఎందుకంటే సినిమాకు యావరేజ్ టాక్ మాత్రమే ఉంది . కాకపోతే విజయ్ కున్న క్రేజ్ తో ఈ భారీ వసూళ్లు వస్తున్నాయి . మొత్తానికి సర్కార్ చిత్రం 200 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని దాటడం మాత్రం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది .

- Advertisement -

English Title: Vijay’s Sarkar 2 days world wide collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All