Homeటాప్ స్టోరీస్సర్కార్ రివ్యూ

సర్కార్ రివ్యూ

sarkar movie review
సర్కార్ రివ్యూ

సర్కార్ రివ్యూ :
నటీనటులు : విజయ్ , కీర్తి సురేష్ , వరలక్ష్మి శరత్ కుమార్
సంగీతం : ఏ ఆర్ రెహమాన్
నిర్మాణం : సన్ పిక్చర్స్
దర్శకత్వం : మురుగదాస్
రేటింగ్ :2. 5 / 5
రిలీజ్ డేట్ : 6 నవంబర్ 2018

ఇళయ దళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ” సర్కార్ ”. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంతో టాలీవుడ్ లో హిట్ కొట్టి తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

బిజినెస్ మెన్ సుందర్ (విజయ్ ) ఓ ఎన్నారై , ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇండియాకు వస్తాడు . అయితే ఓటు వేయడానికి వెళ్లి షాక్ అవుతాడు ఎందుకంటే ఆల్రెడీ తన ఓటు ని ఎవరో వేస్తారు . దాంతో తన ఓటుని ఎవరో వేశారని కోర్టుని ఆశ్రయిస్తాడు సుందర్ . కోర్టు తీర్పు సుందర్ కు అనుకూలంగా రావడంతో మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు . అసలు సుందర్ ఓటుని దుర్వినియోగం చేసింది ఎవరు ? కోమలవల్లి (వరలక్ష్మి శరత్ కుమార్ ) కు సుందర్ కు ఉన్న గొడవ ఏంటి ? అసలు ఎన్నికల మాటున జరుగుతున్న వ్యవహారాలు ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

విజయ్ స్టైల్ , నటన
వరలక్ష్మి శరత్ కుమార్
ఛాయాగ్రహణం
యాక్షన్ ఎపిసోడ్స్

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్
సాంగ్స్
స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

విజయ్ స్టైల్ , యాక్టింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . సర్కార్ చిత్రం వన్ మ్యాన్ షో గా మారింది , యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఫ్యాన్స్ ని విపరీతంగా అలరించడం ఖాయం . విజయ్ తర్వాత చెప్పుకోవాల్సింది వరలక్ష్మి శరత్ కుమార్ గురించే . విజయ్ కి గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటింది వరలక్ష్మి . ముఖ్యంగా క్లైమాక్స్ లో వరలక్ష్మి నటనకు జేజేలు పలకడం ఖాయం . విభిన్న పాత్రలతో సత్తా చాటుతున్న ఈ భామకు మరో వెరైటీ పాత్ర ఈ సర్కార్ చిత్రం . కీర్తి సురేష్ హీరోయిన్ కానీ ఆమెకు నటించే అవకాశం మాత్రం దక్కలేదు పాపం . కేవలం పాటలకు , కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యింది మహానటి . రాధారవి విలన్ గా మెప్పించాడు .

సాంకేతిక వర్గం :

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు కానీ రెహమాన్ స్థాయి సంగీతం అయితే కాదు . పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు అలాగే నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే ! ఇక ఈ సినిమాకు హైలెట్ ఒక్కటే అదే గిరీష్ గంగాధరణ్ అందించిన ఛాయాగ్రహణం . విజువల్స్ చాలా బాగున్నాయి , నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరమీద కనిపించేలా ట్రీట్ చేసాడు గిరీష్ . ఇక దర్శకులు మురుగదాస్ విషయానికి వస్తే ……. దొంగిలించిన కథ ని సవ్యమైన దిశలో రాసుకోలేకపోయాడు దాంతో కథ , కథనం పక్కదారి పట్టాయి . విజయ్ తో కత్తి , తుపాకి లాంటి సూపర్ హిట్స్ తీసిన మురుగదాస్ ఈసారి పూర్తిస్థాయిలో రాణించలేక పోయాడు .

ఓవరాల్ గా :

ఇళయ దళపతి విజయ్ పెర్ఫార్మెన్స్ కోసం , స్టైల్ కోసం చూడొచ్చు అంతేకాని ఎక్కువగా అంచనాలు పెట్టుకొని వెళితే నిరాశపడటం ఖాయం .

English Title: sarkar movie review

                                  Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All