Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ చిత్రంలో లేడీ అమితాబ్!!

మెగాస్టార్ చిత్రంలో లేడీ అమితాబ్!!

Chiranjeevi Vijayashanti
Chiranjeevi Vijayashanti

మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కలయిక అంటేనే 80,90ల్లో అభిమానుల్లో యమ క్రేజ్ ఉండేది.. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, కామిడీ, డాన్సులు, ఆ టైమింగ్ కుదిరినట్లుగా మరెవరికి కుదరదు అన్నట్లుగా ఉంటుంది వీరి జంట. చిరు, విజయ శాంతి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు, కాసుల పంట పండినట్లేనని ఒక రూమర్ ఉండేది అప్పట్లో..!

అలాగే వారిద్దరిది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జోడీ అనే చెప్పుకోవాలి.. వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూసేవారు అభిమానులు. వారిద్దరూ కలిసి నటించిన గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, స్వయం కృషి లాంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.

- Advertisement -

చివరగా ఇద్దరు కలిసి మెకానిక్ అల్లుడు చిత్రంలో నటించారు.. ఆ చిత్రం యావరేజ్ ఆడింది. మళ్లీ ఇంకెప్పుడు వారు కలిసి నటించలేదు.. దాదాపు 26 సంవత్సరాల తర్వాత చిరంజీవి, విజయశాంతి కలిసి నటిస్తున్నారనె వార్త పరిశ్రమలో వినిపిస్తోంది.. సూపర్ డైరెక్టర్ కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్లో కొణిదెల ప్రొడక్షన్ కంపినీ అండ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఈ చిత్రం ఫిమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా రాసినట్లు బోగట్టా.. ఈ క్యారెక్టర్ కోసం లేడీ అమితాబ్ విజయ శాంతిని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. స్టోరీ విని విజయ శాంతి కూడా ఇన్స్పైర్ అయి ఒకే చెప్పినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో విజయశాంతి నటిస్తోంది..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All